గురువారం 24 సెప్టెంబర్ 2020
Food - Aug 03, 2020 , 15:12:08

వామ్మో.. మున‌గాకు ర‌సంతో ఇన్ని ప్ర‌యోజ‌నాలా? తెలిస్తే షాక్ అవుతారు!

వామ్మో.. మున‌గాకు ర‌సంతో ఇన్ని ప్ర‌యోజ‌నాలా?  తెలిస్తే షాక్ అవుతారు!

మున‌గాకును కూరగా వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని ర‌క‌ర‌కాల డిష్‌ల‌లో కూడా వాడేందుకు ఇష్ట‌ప‌డుతారు ప్ర‌ముఖ చెఫ్‌లు. ఈ ఆకు వ‌ల‌న ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. ఆకు ఒక‌టే కాదు. దీని ర‌సం కూడా ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచేంద‌కు దోహ‌ద‌ప‌డుతుంది. మ‌రి మున‌గాకు ర‌సంతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలున్నాయో తెలుసుకుందాం.

* చిన్న‌పిల్ల‌లు ఎప్పుడూ వ్యాధుల బారిన ప‌డుతూనే ఉంటారు. వారిని ఇన్ఫెక్ష‌న్ల‌కు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌పైనే ఉంటుంది. మున‌గాకు ర‌సాన్ని బాగా వేడిచేసి చ‌ల్లార్చాలి. దీనిపైన ఉండే నీటిని వంచేసి ఆ మిశ్ర‌మంలో పాలు పోసి క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌తిరోజూ పిల్ల‌ల‌కు తినిపిస్తుంటే వారి ఎముక‌లు దృఢంగా త‌యార‌వుతాయి. 

* మున‌గాకు ర‌సాన్ని వేడి చేసి చ‌ల్లార్చిన మిశ్రంలో కొంచెం పాలు పోసి క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని చిన్న‌పిల్ల‌ల‌కే కాకుండా గ‌ర్భిణీ మ‌హిళ‌లు తాగుతూ ఉంటే బేబి పెరుగుద‌ల బాగా జ‌రుగుతుంది. అంతేకాదు ప్ర‌స‌వం కూడా సులువుగా అవుతుంది. 

* కొంత‌మంది మూత్రవిస‌ర్జ‌న చేసేట‌ప్పుడు మంట అధికంగా ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో బాగా మ‌రిగించి చ‌ల్లార్చిన మున‌గాకు ర‌సంలో కొంచెం క్యారెట్ జ్యూస్ క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని తాగుతూ ఉంటే మ‌ల‌బ‌ద్ధ‌కం, మూత్ర‌పిండాల వ్యాధుల వంటి స‌మ‌స్య‌లు తొలిగిపోతాయి. 

* రేచీక‌టి, కంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వాళ్లు క్యారెట్ ఎక్కువ‌గా తింటూ ఉంటారు. దీనితోపాటు మున‌గాకు ర‌సంలో కొంచెం తేనె వేసుకొని బాగా క‌లుపుకోవాలి. ప్ర‌తిరోజూ ప‌‌డుకునే ముందు ఈ రెసిపీ తాగితే రేచీక‌టి త‌గ్గ‌డంతోపాటు, జ్ఙాప‌క‌శ‌క్తి పెర‌గుతుంది.     

* మున‌గ పువ్వుల‌ను సేక‌రించి వాటి ర‌సం తీసుకోవాలి. ఒక స్పూన్ మున‌గ పువ్వు రసంలో గ్లాస్ మ‌జ్జిగ క‌లిపి తాగాలి. ఈ ఔష‌ధాన్ని త‌ర‌చూ తాగ‌డం వ‌ల్ల అజీర్తి, ఉబ్బ‌సం నుంచి ఉప‌శ‌మ‌నాన్నిస్తుంది.  

* మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు మున‌గాకు ర‌సంలో కొద్దిగ లేతకొబ్బ‌రి నీరు పోసి క‌లిపి తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది. 

 


logo