ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Food - Aug 12, 2020 , 16:30:18

వ‌ర్షాకాలంలో బోడ కాక‌ర‌కాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా? తెలిస్తే వ‌దిలిపెట్ట‌రు!

వ‌ర్షాకాలంలో బోడ కాక‌ర‌కాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా?  తెలిస్తే వ‌దిలిపెట్ట‌రు!

మార్కెట్‌లో అప్పుడ‌ప్పుడు క‌నిపించే బోడ కాక‌ర‌కాయ‌లు చాలామందికి తెలియ‌దు. తెలిసిన వాళ్లు రేటు గురించి అస‌లు వ‌దిలిపెట్ట‌రు. రేటు ఎక్కువైతే ఏం మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి అట‌వీ ప్రాంతంలో పండుతాయి కాబ‌ట్టే వీటికి అంత రేటు. కాక‌ర‌కాయ‌ల్లా క‌నిపించే ఈ బుల్లి బుల్లి కాక‌ర‌కాయ‌లు ఆరోగ్యాన్నే కాదు మంచి టేస్ట్‌ను క‌లిగి ఉంటుంది. వీటిని వ‌ర్షాకాలంలో తింటే మ‌రీ మంచిది. మ‌రి వీటి వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటో చూసేద్దాం.

* వ‌ర్షాకాలంలో మొద‌ల‌య్యే జ‌లుబు, ద‌గ్గు, తుమ్ముల‌ను నుంచి బోడ కాక‌ర ర‌క్షిస్తుంది. అంతేకాదు వివిధ అలెర్జీలకు దూరం చేస్తుంది. 

* బోడ కాక‌ర‌‌ల‌ను కూర చేసేట‌ప్పుడు పైన ఉండే తొక్కును తొలిగించ‌కూడ‌దు. అలా చేస్తే అందులో ఉన్న పోష‌కాల‌న్ని పోతాయి. 

* దీనిని ఆకాక‌ర అని కూడా అంటారు. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కాక‌పోతే వారికి దీంతో త‌యారు చేసిన వంట‌కం పెట్ట‌డం మంచిది. 

* ఇందులోని ఫొలేట్లు శ‌రీరంలోని కొత్త క‌ణాల‌ను వృద్ది చెందేలా చేస్తాయి. ఇవి గ‌ర్భంలోని శిశువు ఎదుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతాయి. 

* ఇది డ‌యాబెటిస్‌ను నియంత్రిస్తుంది. 

* వీటిలో ఉండే కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధుల‌ను ద‌రిచేర‌కుండా చేస్తుంది.

* దీనిలో విట‌మిన్ సి ఉంటుంది. ఇది ఇన్ఫెక్ష‌న్ల‌తో పోరాడుతుంది.

* ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

* క్యాన్స‌ర్ వంటి పెద్ద వ్యాధుల బారిన ప‌డ‌కుండా చూసేందుకు బోడ కాక‌ర ఎంతో తోడ్ప‌డుతుంది.

* మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డేవారు ఈ కాక‌ర తింటే మేలు జ‌రుగుతుంది.

* చ‌ర్మం మెరుగుప‌డేందుకు కూడా బోడ కాక‌ర ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

* ఆకాక‌ర‌లో ప్ల‌వ‌నాయిడ్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి వ‌య‌సును క‌నిపించ‌కుండా చేస్తుంది. వ‌య‌సు పెరిగినా యంగ్‌గా క‌నిపించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. అంతేకాదు చ‌ర్మంపై ముడ‌త‌ల‌ను త‌గ్గిస్తుంది.     


logo