గురువారం 21 జనవరి 2021
Food - Sep 24, 2020 , 17:33:32

'చెరుకు ర‌సం' వ‌ల్ల ఎన్నో లాభాలు.. ముఖ్యంగా వీరికి!

'చెరుకు ర‌సం' వ‌ల్ల ఎన్నో లాభాలు.. ముఖ్యంగా వీరికి!

సిటీల్లో ఎక్క‌డ‌ప‌ట్టినా షుగ‌ర్‌కేన్ బండ్లు తార‌స‌ప‌డుతుంటాయి. కానీ ఎన్ని ఉన్నా వారికి మంచి గిరాకీ త‌గ‌లుతుంది. ఎందుకంటే చెరుకు ర‌సానికి అంత డిమాండ్‌. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. శ‌రీరం వేడెక్కిన‌ప్పుడు చెరుకు ర‌సం చ‌ల్ల‌బ‌రుస్తుంది. ఇంకా చెరుకు ర‌సం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటో తెలుసుకుందాం.

* కామెర్ల వ్యాధితో బాధ‌ప‌డేవారికి చెరుకు ర‌సం తోడ్ప‌డుతుంది. 

* జ్వ‌రానికి గురైన‌ప్పుడు చాలా నీర‌సంగా త‌యార‌వుతారు. అలాంట‌ప్పుడు చెరుకుర‌సం తాగ‌డం వ‌ల్ల కోల్పోయిన ప్రొటీన్ల‌ను భ‌ర్తీ చేస్తుంది.

* చెరుకు ర‌సం తాగ‌డం వ‌ల్ల దాహం తీర్చ‌డ‌మే కాకుండా తిన్న ఆహారాన్ని కూడా జీర్ణం చేస్తుంది.

* డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డేవారు చెరుకు ర‌సం తాగాలా వ‌ద్దా అనే డైల‌మాలో ఉంటారు. అలాంటివారికి గుడ్‌న్యూస్‌. చెరుకు ర‌సం ర‌క్తంలోని చెక్క‌ర స్థాయిల‌పై ప్ర‌భావం చూప‌ద‌ని వైద్యులు వెల్ల‌డించారు. 

* చెరుకు ర‌సం ప్రోటీన్ లెవ‌ల్స్‌ని పెంచుతుంది. లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

* ఇందులో క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఎల‌క్ట్రోలైట్స్, మెగ్నీషియం, ఐర‌న్ వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరాన్ని డీహైడ్రేట్‌కు గుర‌వ్వ‌కుండా కాపాడుతాయి.

* చెరుకు ర‌సం తియ్య‌గా ఉండ‌టంతో జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌కు గురిచేస్తుంద‌ని దూరం పెడుతుంటారు. దీనివ‌ల్ల అలాంటి స‌మ‌స్య‌లేం రావు. ఇంకా చెప్పాలంటే చెరుకు ర‌సం జ‌లుబు, గొంతునొప్పి, ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల‌ను నివారిస్త‌తుంది.

* చెరుకు ర‌సం తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

* అస‌ల‌ట‌, ఒత్తిడి, నీర‌సంగా అనిపించిన‌ప్పుడు రెండు గ్లాసుల షుగ‌ర్‌కేన్ తాగితే త‌క్ష‌ణ‌మే ఎన‌ర్జీ పొంద‌వ‌చ్చు. 


logo