ఆదివారం 24 జనవరి 2021
Food - Dec 05, 2020 , 21:17:58

ముల్లంగి ఎంత మేలు చేస్తుందో తెలుసా..?

ముల్లంగి ఎంత మేలు చేస్తుందో తెలుసా..?

హైదరాబాద్‌: ముల్లంగి చిన్నదిగా ఉంటుంది కదా అని తీసి పడేసేరు. రుచిలో కాస్త ఘాటుగా అనిపించినా.. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే  ఆశ్చర్యపోతారు. ముల్లంగిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. క్యారెట్‌లా కరకరలాడే ముల్లంగిని చాలా మంది పచ్చిగానే తింటారు. కొందరు రసంలా(సలాడ్) తీసుకుంటారు. అయితే, ముల్లంగిని తినడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ముల్లంగి ఆరోగ్యానికి ఎందుకు మంచిది..?

ముల్లంగిలో విటమిన్-బి, సి, ఐరన్, విటమిన్-కె, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రాథమిక శారీరక ప్రక్రియను మెరుగుపరచడమేకాక, అరుగుదలకు దోహదపడే ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. ముల్లంగిలో గ్లుకోసినోలెట్స్, సల్ఫర్ కాంపౌండ్స్, యాంటీ-ఇన్‌ఫ్లమెటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ ప్రాపర్టీస్‌ అధికంగా ఉంటాయయి

ఒక ముల్లంగిలో ఏముంటాయి..?

18 గ్రాంల కేలరీలు

ఒక గ్రాం ప్రొటీన్

ఒక గ్రాం ఫ్యాట్

4 గ్రాంల కార్బోహైడ్రేట్స్

2 గ్రాంల ఫైబర్

2 గ్రాంల చక్కెర

ఆరోగ్య ప్రయోజనాలు..

1. ఇమ్యూనిటీ పెరుగుతుంది. 

ముల్లంగిలోని విటమిన్-సి, బి ఉంటాయి. ఇవి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి రోగనిరోధక శక్తని పెంపొందిస్తాయి. వీటితో పాటు ముల్లంగి రోగాలకు కారణమయ్యే క్రిములను చంపి యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొత్త రోగనిరోధక కణాలను నిర్మించడంలో సహాయపడి.. మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

2. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. 

ముల్లంగిలోని విటమిన్-సి క్యాన్సర్‌ను అరకట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్-సి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే డ్యామేజ్ అయిన కణాలను, హానికరమైన కణాలను చంపి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

3. అరుగుదల బాగుంటుంది. 

కూరగాయలన్నింటిలోనూ ముల్లంగిలోనే అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది అరుగుదలను పెంచి మీ జీర్ణవ్యవస్థను కాపాడుతుంది. వీటిలో లిగ్నిన్ అనే ఫైబర్ ద్రవాలు, వ్యర్థాలను గ్రహించి సహజ జీర్ణ ప్రక్రియకు సహాయపడుతుంది. 

4. డయాబెటిస్ రాకుండా ఉంటుంది. 

ముల్లంగి యాంటీబయోటిక్స్ కలిగి ఉంటుంది. అయితే దీంట్లోని ఫైబర్ గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుందని తాజా అధ్యయనంలో తేలింది.  ఫలితంగా డయాబెటిస్ లాంటి సమస్యకు దూరంగా ఉండొచ్చు.

మరిన్ని అప్‌డేట్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.


logo