గురువారం 24 సెప్టెంబర్ 2020
Food - Aug 05, 2020 , 17:08:55

జీర్ణ‌క్రియ సాఫీగా జ‌ర‌గాలంటే ఈ ప‌ప్పులు తినాల్సిందే!

జీర్ణ‌క్రియ సాఫీగా జ‌ర‌గాలంటే ఈ ప‌ప్పులు తినాల్సిందే!

హాస్పిట‌ల్‌కు వెళ్ల‌కుండానే ఆరోగ్యంగా ఉండాలంటే పిస్తా ప‌ప్పులు ప్ర‌తిరోజూ తింటే స‌రిపోతుంది. ఇప్పుడు అస‌లే క‌రోనా టైం. ఈ ప‌రిస్థితుల్లో ఆరోగ్యం చ‌క్క‌పెట్టుకోకుంటే క‌రోనా దాడికి బ‌ల‌వ్వాల్సిందే. మ‌రి పిస్తా ప‌ప్పు తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటో తెలుసుకోండి. 

* పిప్తా ప‌ప్పులో విట‌మిన్ సి స‌మృద్దిగా ఉంటుంది. ముడ‌త‌లు లేని చ‌ర్మం సొంతం చేసుకోవాలంటే పిస్తా తినాల్సిందే. 

* కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు పిస్తా తిన‌డం ఉత్త‌మం. ఇందులోని కెరోటినాయిడ్లు కంటిలోని క‌ణాల‌ను పున‌రుద్ద‌రించి కంటిచూపును మెరుగుప‌రుస్తుంది. 

* ఊరితిత్తులు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి పిస్తా ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తుంది. ఇది శ‌రీర అవ‌య‌వాల‌కు ప్రాణ వాయువుని చేర‌వేస్తుంది. 

* క‌రోనా టైంలో ఎంతో ఉప‌యోగ‌ప‌డే రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు కూడా పిస్తా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇన్ఫెక్ష‌న్ల బారి నుంచి శ‌రీరాన్ని కాపాడుతుంది.   

* పిస్తాలో పీచుప‌దార్థం పుష్క‌లంగా దొరుకుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారి డైట్‌లో పిస్తా మొద‌టి స్థానంలో ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్‌ని పెరిగేలా చేస్తుంది. 

* పిస్తా గుండె జ‌బ్బుల‌ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు న‌రాల వ్య‌వ‌స్థ‌ను పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది.  

* శ‌రీరంలోని ఎర్ర ర‌క్త‌క‌ణాల ప‌నితీరును పిస్తా మెరుగుప‌రుస్తుంది. ఇది క్యాన్స‌ర్ వంటి పెద్ద రోగాల‌ను నిరోధిస్తుంది. అన్నిటిక‌న్నా ముఖ్య‌మైన‌ది పిస్తా ఎముక‌ల‌ను దృఢంగా ఉంచుతుంది. అంతేకాదు జీర్ణ‌క్రియ స‌మ‌స్య‌ల‌ను క్లియ‌ర్ చేయ‌డానికి పిస్తా ప్ర‌త్యేకం. 

 


logo