మంగళవారం 26 మే 2020
Food - May 02, 2020 , 14:50:09

నెయ్యి తింటే బరువు పెరుగుతారా?

నెయ్యి తింటే బరువు పెరుగుతారా?

మ‌న‌లో చాలా మందికి నిత్యం ఉదయం లేవ‌గానే బెడ్ కాఫీ లేదా టీ తాగే అల‌వాటు ఉంటుంది. గొంతులో టీ లేదా కాఫీ చుక్క ప‌డందే ఎవరూ బెడ్ మీద నుంచి లేవ‌రు. అయితే నిజానికి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున కాఫీ, టీ తాగ‌డం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకు బ‌దులుగా ఒక‌టి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తాగితే దాంతో మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నెయ్యి తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి.

2. నెయ్యి తాగడం వ‌ల్ల బ‌రువు పెరుగుతామ‌ని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే నెయ్యిలో ఉండే కొవ్వు ప‌దార్థాలు మ‌న‌కు మేలు చేస్తాయి. అధిక బ‌రువును త‌గ్గిస్తాయి.

3. అల్స‌ర్లు ఉండేవారు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నెయ్యి తాగ‌డం మంచిది.

4. నెయ్యి తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రులు ఆరోగ్యంగా ఉంటాయి.

5. ఆక‌లి మంద‌గించిన వారు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నెయ్యి తాగితే ఆక‌లి బాగా పెరుగుతుంది.logo