శుక్రవారం 05 మార్చి 2021
Food - Feb 02, 2021 , 15:29:39

మొక్కజొన్న..పోషకాలలో మిన్న

మొక్కజొన్న..పోషకాలలో మిన్న

చాలా మంది ఇష్టంగా తినే వాటిలో మొక్కజొన్న ఒకటి. ఇది చక్కని రుచిని అందించడమే కాక ఆరోగ్యానికి చాలా రకాల మేలు చేస్తుంది. మొక్కజొన్న  ఫైబర్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, సి, ఫొలేట్, యాంటీఆక్సిడెంట్లు లాంటి మైక్రోన్యూట్రియన్లను కలుగి ఉంటుంది. అంతేకాదు.. 100గ్రాముల మొక్కజొన్న పొత్తులో 125కేలరీలు, 27గ్రాముల కార్బ్స్, 5గ్రాముల ప్రొటీన్లు, 9గ్రాముల చెక్కర ఉంటాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.  

1.కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

మొక్కజొన్నలోని విటమిన్-ఎ, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడతాయి. రోజూ దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగవడమే కాక మ్యాకులర్ డీజనరేషన్ సమస్య రాకుండా ఉంటుంది. 

2. బరువు తగ్గిస్తుంది

బరువు తగ్గాలనుకునే వారికి ముఖ్యంగా కావాల్సింది ఫైబర్. మొక్కజొన్నలో పుష్కలమైన ఫైబర్ లభిస్తుంది. ఇది అరుగదలకు తోడ్పడి బరువు తగ్గేలా చేస్తుంది. దీంట్లోని యాంటీఆక్సిండెంట్లు బాడీ మెటబాలిజం పెంచుతాయి.

3. శక్తినిస్తుంది

చాలా మంది అథ్లెట్లు, ఫిట్ నెస్ ప్రియులు తరచుగా మొక్కజొన్నలను తినేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే.. దీంట్లోని కార్బోహైడ్రేట్లు మనం తినే ఆహారాన్ని నెమ్మదిగా అరిగించడమే కాక.. శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తాయి.

4. రక్తపోటును నియంత్రిస్తుంది

మొక్కజొన్నలోని పొటాషియం, మెగ్నిషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాక రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడతాయి. అలాగే దీంట్లోని ఫైబర్ శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి.

5. డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

మొక్కజొన్నలోని ఆంథోసియానిన్ కాంపోనెంట్ శరీరంలోని ఇన్సిలిన్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. ఫలితంగా డయాబెటిస్‌ ప్రమాదం తగ్గుతుంది.

VIDEOS

logo