ప్రయోజనాలే కానీ దుష్పరిణామాలు లేవు
నిర్లక్ష్యంగా ఉంటే కరోనా కాటు తప్పదు
వ్యాక్సిన్‌తో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చు
‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో నిర్మల్ జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్
నిర్మల్ అర్బన్, మార్చి 8: కొవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు టీకా ఎంతో ప్రయోజన మని నిర్మల్ డీఎంహెచ్‌వో ధన్‌రాజ్ అన్నారు. టీకాపై అపోహలు పెట్టుకోవద్దని, ప్ర తి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. జిల్లాలో వ్యాక్సినేషన్ తీరు, కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీకా ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ ‘నమస్తే’కు గురువారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే: టీకాతో ప్రయోజనం ఏంటి?
డీఎంహెచ్‌వో: వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయచ్చు. టీకా తీసుకోవడం తో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరంలోకి వైరస్ ఎంటర్ కాగా నే, పోరాడి ప్రతి దాడి చేస్తుంది. దీంతో త్వరగా వైరస్ బారిన పడే అవకాశం ఉండ దు. ప్రభుత్వం పూర్తిగా ఆలోచించే అందరికీ ఉచితంగా టీకా అందిస్తున్నది.
నమస్తే: వ్యాక్సిన్‌తో ఆరోగ్య సమస్యలు ఉంటాయా..?
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మాత్రమే ఉంటాయి
నమస్తే: టీకా వేసుకున్నా నిబంధనలు పాటించాలా..?
టీకా వేసుకున్నా కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. నిర్లక్ష్యంగా ఉంటే మొదటికే మోసం వస్తుంది. మాస్కు తప్పక ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. నిబంధనలు పాటిస్తేనే మహమ్మారి బారి నుంచి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది.
నమస్తే: వ్యాక్సిన్ తర్వాత కూడా పాజిటివ్‌కు అవకాశం ఉందా..?
టీకా వేసుకున్నా కొవిడ్ నిబంధనలు పాటించకుంటే కచ్చితంగా పాజిటివ్ వస్తుంది. టీకా వేసుకోక ముందు కొవిడ్ వచ్చిన వారికంటే, వేసుకున్న వారికి ఎక్కువ ప్రమా దం ఉండదు. టీకా వేసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అంతగా ఆరోగ్యంపై ప్రభావం చూపదు.
నమస్తే: కోవాగ్జిన్, కోవిషీల్డ్లలో ఏది ఉత్తమం..?
రెండూ శక్తివంతమైనవే.ఈ రెండు వ్యాక్సిన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.
నమస్తే: జిల్లాలో ఏఏ టీకాలు అందుబాటులో ఉన్నాయి?
రెండు టీకాలూ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కొరత ఉండకుండా చూస్తున్నాం. రెండింటిలో ఏ టీకా వేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.
నమస్తే: టీకా ప్రక్రియ ఎలా కొనసాగుతున్నది?
జిల్లావ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్ వేసేలా దృష్టి పెట్టాం. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నాం. 25 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెలాఖ రులోగా 1.50 లక్షల మందికి టీకాను అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
నమస్తే: మద్యం తాగేవారిపై టీకా దుష్ప్రభావం చూపుతుందా..?
మద్యం తాగే వారు టీకాకు దూరంగా ఉండడం సరైన పద్ధతి కాదు. టీకా తీసుకునే రెండు రోజుల ముందు, ఆ తర్వాత రెండు రోజులు దూరంగా ఉంటే సరిపోతుంది. ఇతరులు చెప్పే తప్పుడు సమాచారాన్ని నమ్మద్దు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేందుకు ధైర్యంగా ముందుకు రావాలి.
నమస్తే: సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లపై ఎలా స్పందిస్తారు..?
టీకా వేసుకునేందుకు ఇష్టం చూపని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారు. వీరి కారణంగా కొందరు ప్రజలు కూడా వెనుకడుగు వేస్తున్నారు. దీని కారణంగా వారి కుటుంబాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. సోషల్ మీడి యాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు. అనుమానాలు ఉంటే వైద్యులను సంప్రదించి, నివృత్తి చేసుకోవాలి. లేకుంటే పొంచి ఉన్న ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది.
నమస్తే: టీకా వేసుకోకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి?
మొదటగా వారితో పాటు వారి కుటుంబాన్ని అనారోగ్యం పాలు చేసి ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంటుంది. టీకా తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వైరస్ బారిన పడ్డా, రెండు మూడు రోజుల్లో తగ్గించుకోవచ్చు. టీకా వేసుకొని చిన్నపాటి నిబంధనలు పాటిస్తే, ఎంతో ప్రేమను పంచే కుటుంబాన్ని అటు సమాజాన్ని కాపాడినట్లు అవుతుంది.