సోమవారం 18 జనవరి 2021
Food - Jul 18, 2020 , 20:36:22

స‌బ్జాగింజ‌ల‌తో త‌ల‌నొప్పి హుష్ కాకి! ఎలాగంటే..?

స‌బ్జాగింజ‌ల‌తో త‌ల‌నొప్పి హుష్ కాకి! ఎలాగంటే..?

ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్న‌వారికి త‌ల‌నొప్పి ప‌క్కాగా ఉంటుంది. ఆ స‌మ‌యంలో దాని నుంచి ఎస్కేప్ అవ్వ‌డానికి మార్కెట్‌లో దొరికే టాబ్లెట్స్ తీసుకొని మింగేస్తుంటారు. అలా ఇంగ్లిష్ మందులు మింగ‌డం అంత మంచిది కాదు. కాబ‌ట్టి ఇంట్లో దొరికే సబ్జా గింజ‌ల‌తో త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అంతేకాదు, ఈ గింజ‌ల‌తో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివ‌రంగా చూద్దాం. 

* ముందుగా స‌బ్జా గింజ‌ల‌ను తీసుకొని గోరువెచ్చ‌ని నీటిలో వేయాలి. అలాగే కొంచెం తేనె, అల్లం ర‌సం వేసి బాగా క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లుపాలి. త‌ర్వాత తాగితే త‌ల‌నొప్పితోపాటు, మైగ్రేన్ ఉన్నా త‌గ్గిపోతుంది.  

* ఈ ఇంగ్రీడియంట్స్ ఏవీ లేక‌పోయినా క‌నీసం స‌బ్జాగింజ‌ల‌ను నీటిలో వేసుకొని తాగినా జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు తొలిగిపోతాయి. ఇందులో డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉండే ఫైబ‌ర్ స‌బ్జా గింజ‌లు తీసుకుంటే మంచిది. 

* ప్ర‌తిరోజూ ఈ మిశ్ర‌మం తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. ఇది శ‌రీరంలోనే కాదు శ‌రీరం బ‌య‌ట గాయాల‌ను కూడా మ‌న్పిస్తుంది. స‌బ్జా గింజ‌ల‌ను పొడి చేసి దాన్ని గాయాల‌పై వేసి క‌ట్టు క‌డితే త్వ‌ర‌గా మానిపోతాయి. దీంతోపాటు ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్ల‌ను ద‌రిచేర‌నివ్వ‌దు. 

* ఈ రోజుల్లో అధిక బ‌రువుతో బాధ‌ప‌డేవారే ఎక్కువ‌గా ఉన్నారు. అలాంటి వారు బాధ‌ప‌డ‌డం మానేసి స‌బ్జా గింజ‌లు ఆహారంగా తీసుకోండి. దీనివ‌ల్ల క‌డుపు నిండుతుంది. ఆహారం త‌క్కువ తీసుకునేలా చేస్తుంది. కాక‌పోతే ఇవి వ‌ట్టివి కాకుండా నిమ్మ‌ర‌సంతో ప‌ర‌గ‌డుపున తీసుకుంటే తొంద‌ర‌గా బ‌రువు త‌గ్గొచ్చు. 

* స‌బ్జా గింజ‌ల‌ను నీటిలో వేసుకొని తింటే ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఈ రెసిపీ చిన్న‌పిల్ల‌లు, టీనేజ్ వారికి తినిపిస్తే ఉత్సాహంగా ఉంటారు. 

* వ్యాయామం చేసేవాళ్లు ఎన‌ర్జీ కోల్పోతుంటారు. అలాంటి వారు స‌బ్జా గింజ‌లు తాగితే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. క్రీడారంగానికి చెందిన వారు ఎక్కువ‌గా ఈ రెసిపీ తీసుకుంటూ ఉంటార‌ని వైద్యులు తెలుపుతున్నారు.