ఆదివారం 24 జనవరి 2021
Food - Aug 07, 2020 , 16:35:50

ఇప్పుడు ఈ ఆహారాన్ని మాత్ర‌మే తీసుకోవాలి!

ఇప్పుడు ఈ ఆహారాన్ని మాత్ర‌మే తీసుకోవాలి!

మంచి ఆహారం తిన‌డం వ‌లన రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ ప‌వ‌ర్ వ‌ల‌న క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టొచ్చ‌ని వైద్యులు, న్యూట్రిష‌నిస్టులు చెబుతున్నారు. అందుకే మొన్న‌టి వ‌ర‌కు దొరికిన ఫుడ్‌తో స‌రిపెట్టుకున్నా ఇప్పుడు మాత్రం చాలా మార్పులు వ‌చ్చాయి. సీజ‌న‌లో వ‌చ్చే ఆహార ప‌దార్థాల‌ను వ‌దిలిపెట్ట‌కుండా తిన‌డం వ‌ల్ల హెల్త్ బెనిఫిట్స్‌ని పొంద‌వ‌చ్చు. సీజ‌న్ అంటే ఇప్పుడు న‌డుస్తున్నది వ‌ర్ష ఋతువు. ఈ వ‌ర్షాకాలంలో ఈ ప‌ద్ధ‌తులు త‌ప్ప‌కుండా పాటించాలి. అవేంటంటే..

ఉప్ప‌గా ఉండే ప‌దార్థాలు అలాగే పుల్ల‌గా ఉండే ప‌దార్థాల‌పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా హాయిగా తినేయొచ్చు. వీటితోపాటు జిడ్డులేని ప‌దార్థాల‌ను ఈ కాలంలో తినొచ్చు. డైట్ ఫాలో అయ్యేవాళ్లు ఎక్కువ‌గా సూప్ తీసుకోవ‌డం మంచిది. మిన‌ర‌ల్ వాట‌ర్ తాగ‌డంకంటే నీటిని కాచుకొని తాగ‌డం శ్రేయ‌స్క‌రం. ఇక ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో జీర్ణంకాని ఆహారాన్ని అతిగా తిన‌డం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. 


logo