ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Food - Aug 08, 2020 , 16:55:52

వర్షాకాలంలో ఈ పండ్లు, కూర‌గాయ‌ల‌ను తిన‌కూడ‌దు! ఒక‌వేళ తింటే..

వర్షాకాలంలో ఈ పండ్లు, కూర‌గాయ‌ల‌ను తిన‌కూడ‌దు! ఒక‌వేళ తింటే..

రుతుప‌వ‌నాలు అనేక అంటువ్యాధుల‌కు అడ్డా. వ‌ర్షాకాలంలో బ‌య‌ట నుంచి ఇంటికి తెచ్చే ప్ర‌తి వ‌స్తువు మీద ఉండే క్రిముల‌ను త‌రిమికొట్టాలి. అలాగే నిత్యావ‌స‌రాల‌కోసం షాపింగ్ చేసేట‌ప్పుడు, ప‌నికి వెళ్లేట‌ప్పుడు యాదృచ్చిక వ‌స్తువుల‌ను తాక‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. క‌రోనా వైర‌స్ ఉన్నా లేకున్నా ఈ కాలంలో మాత్రం ఆహార భ‌ద్ర‌త చాలా ముఖ్యం. ఈ కాలంలో కూర‌గాయ‌లు, పండ్లు క‌లుషిత‌మ‌వుతాయి లేదంటే త్వ‌ర‌గా కుళ్లిపోతాయి. వీటిని చూసుకోకుండా తిన‌డం వ‌ల్ల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి. అందులో ముఖ్యంగా 4 ర‌కాల పండ్లు, కూర‌గాయ‌లు చాలా ప్ర‌భావితం చేస్తాయి. మ‌రి అవేంటి త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి.

ఆకు కూర‌లు : ఎప్పుడైనా, ఎక్క‌డైనా ఎలాంటి ప‌రిస్థితుల్లో అయినా ఆకుకూర‌లు తినాల‌ని చెబుతుంటారు. కానీ వ‌ర్షాకాలంలో అంత‌గా తిన‌క‌పోవ‌డ‌మే మంచిది అంటున్నారు. ఎందుకంటే ఈ కాలంలో ఆకుకూర‌లు ఎక్కువ‌గా తేమ‌గా ఉంటాయి. దీని కార‌ణంగా ఇవి త్వ‌ర‌గా చెడిపోతాయి. వీటిలో బ‌చ్చ‌లికూర‌, మెంతి కూర‌ను వ‌ర్షాకాలంలో తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. వీటికి బ‌దులుగా కాక‌ర‌కాయ‌, సొర‌కాయ తిన‌డం మంచిది.    

క‌ట్ చేసిన పండ్లు, జూస్‌లు : మ‌న‌దేశంలో పండ్లు, జూసులు ఎక్కువ‌గా అమ్ముడుపోతాయి. ఎంత చిన్న బండి పెట్టుకున్నా బాగా గిట్టుబాటు అవుతుంది. అయితే కొన్ని బండ్ల‌మీద ముందుగానే పండ్ల‌ను క‌త్తిరించి పెట్టి ఉంటారు. అవి ఎర్ర‌గా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌డంతో వాటినే కొనుగోలు చేసి తింటారు. అలాగే వాటితో త‌యారు చేసిన జూసుల‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతారు. ఇప్ప‌టి నుంచి ఈ అల‌వాటును మార్చుకోండి. ఈ పండ్లు సూక్ష్మ‌క్రిములు క‌లిగి ఉంటాయి. అంతేకాదు ఈ జూసుల‌లో కొంచెం నీరు కూడా క‌లుపుతారు. ఇవి గ‌నుక క‌లుషిత‌మైతే టైఫాయిడ్ వంటి తీవ్ర‌మైన వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతాయి. వీటి మీద కీట‌కాలు కూడా వ‌చ్చి వాలుతాయి.  

క్రూసిఫరస్ కూరగాయలు : కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి క్రూసిఫరస్ కూరగాయలు పైన చాలా పొర‌ల‌ను క‌లిగి ఉంటుంది. ఇవి కీట‌కాల‌ను త‌నిఖీ చేయ‌డం క‌ష్టం. పెంపుడు జంతువులు, కీట‌కాలు వ‌ర్షాకాలంలో చాలా సాధార‌ణంగా కూర‌గాయ‌ల‌పై దాడి చేస్తాయి. ఈ కాలంలో వీటిని తిన‌డం మానేయాలి. అంతేకాకుండా ఈ కూర‌గాయ‌ల‌తో చేసిన ఆహార ప‌దార్థాల‌కు కూడా దూరంగా ఉండాలి.  

పుట్టగొడుగులు : పుట్టగొడుగులు తడిగా ఉన్న నేలలో పెరుగుతాయి. వాటిపై బ్యాక్టీరియా పెరుగుతుంది, ముఖ్యంగా వర్షాకాలంలో బయటి నుంచి పుట్టగొడుగులను తినకుండా ఉండాలి.logo