మంగళవారం 27 అక్టోబర్ 2020
Food - Sep 12, 2020 , 16:00:38

క‌రివేపాకు పొడి తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలివే!

క‌రివేపాకు పొడి తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలివే!

క‌రివేపాకు లేనిదే క‌ర్రీ లేదు. ఒక‌వేళ క‌రివేపాకు లేకుండా కూర చేసినా దాని వెలితి క‌న‌బ‌డుతూనే ఉంటుంది. దీన్ని వంట‌ల్లో వాడ‌టం వ‌ల్ల రుచి మాత్ర‌మే కాదు. దీంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగున్నాయి. అందుకే క‌రివేపాకుకు అంత ప్రాముఖ్య‌త ఇస్తారు. అలాగే వ‌ట్టి క‌రివేపాకు తిన్నా మంచిదే. లేదంటే దీనికి పొడి రూపంలో చేసుకొని తింటే ఇంకా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మ‌రి క‌రివేపాకు పొడి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటో చూసేద్దాం.

* వేడి వేడి అన్నంలో క‌రివేపాకు పొడి వేసుకొని దీంతోపాటు కొంచెం నెయ్యి వేసుకొని క‌లుపుకొని తింటే అహా.. ఆ టేస్టే వేరు. 

* క‌రివేపాకు పొడి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు పాడ‌వ‌కుండా ఉంటుంది. ఈ క‌రివేపాకు పొడి తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది.

* అలాగే అధిక కొలెస్ట్రాల్‌తో బాధ‌ప‌డేవారు ప్ర‌తిరోజూ ఆహారంలో క‌రివేపాకు పొడి యాడ్  చేసుకోవ‌డం మంచిది. ఎందుకంటే ఇది కొవ్వును త‌గ్గించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

* క‌రివేపాకును డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఏజింగ్‌తో పాటు డయాబెటిస్, క్యాన్సర్ అలాగే కార్డియోవాస్కులర్ వంటి వివిధ క్రానిక్ రోగాల‌ను అరికట్టవచ్చు.

*ఉద‌యాన్నే తినే ఆహారంలో మొద‌టి రెండు ముద్ద‌ల‌ను క‌రివేపాకు పొడితో తింటే బ‌రువు త‌గ్గుతారు. అలాగే బ‌రువు పెర‌గ‌కుండా చూసుకుంటుంది.

* దెబ్బ‌లు, కాలిన గాయాలతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా? పచ్చి కరివేపాకును పేస్ట్‌లా చేసుకొని దానిని దెబ్బలు, ర్యాషెస్ అలాగే కాలిన గాయాలపై రోజుకు నాలుగుసార్లు అప్లై చేస్తే ఫలితం ఉంటుంది.

* క‌రివేపాకు జుట్టు పెరుగుద‌ల‌కు దోహ‌ద‌ప‌డుతుంది. దీనిని పొడి చేసుకొని హెయిర్ ఆయిల్‌లో వేసి జుట్టుకు స్ప్రే చేసి పెట్టాలి. మ‌రుస‌టి ఉద‌యాన్నే త‌ల‌స్నానం చేస్తే జుట్టు దృఢంగా త‌యార‌వుతుంది. 

* ఈ మ‌ధ్య ప్ర‌తిఒక్క‌రినీ వేధిస్తున్న స‌మ‌స్య ప్రీమెచ్చూర్ హెయిర్ గ్రే. అంటే చిన్న వ‌య‌సులోనే జుట్టు తెల్ల‌బ‌డ‌టం. దీనికి క‌రివేపాకు చ‌క్క‌ని ప‌రిష్కారం. కరివేపాకు హెయిర్‌లోని డార్కర్ పిగ్మెంటేషన్‌ను పెంచేందుకు హెల్ప్ చేస్తుంది.

* గ్యాస్ట్రిక్ ట్ర‌బుల్‌, డ‌యేరియా వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి క‌రివేపాకు ఉప‌శ‌మ‌నాన్నిస్తుంది. క‌రివేపాకు తిన‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. 

* అన్నిటిక‌న్నా ముఖ్యంగా క‌రివేపాకు ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. ఇది శ‌రీరాన్ని ప్ర‌శాంతంగా ఉంచుతుంది. 

* గ‌ర్భిణీ స్త్రీల‌కు వికారం, వాంతులు ఎక్కువ‌గా అవుతుంటాయి. దీంతో వారు నిరాశ‌కు గుర‌వుతారు. దీన్ని త‌గ్గించేందుకు క‌రివేపాకు ఎంత‌గానే ఉప‌యోగ‌ప‌డుతుంది. 


logo