శుక్రవారం 10 జూలై 2020
Food - Jan 31, 2020 , T00:10

ఇవి తినండి.. అందంగా కనిపించండి!

ఇవి తినండి.. అందంగా కనిపించండి!

అందం కేవలం క్రీమ్స్‌, లోషన్స్‌ను ముఖానికి పట్టిస్తేనే రాదు. ఆరోగ్యకరమైన ఆహారశైలితో కూడా ముఖం కాంతివంతంగా మారుతుంది. దీనికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..

  • పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియం వృద్ధాప్య ప్రక్రియను ఆపడానికి సహాయపడుతుంది. మొటిమలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి పెరుగు చర్మాన్ని రక్షిస్తుంది. పాలకూరలో విటమిన్‌ ఏ, సి ఉంటాయి. విటమిన్‌ సి కొల్లాజెన్‌ నిర్మాణానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది.
  • చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కోడిగుడ్డుది ప్రత్యేక స్థానం. గుడ్డు పచ్చసొనలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చర్మానికి ఇవి తేమను అందిస్తాయి. అయితే గుడ్డు తెలుపులో చర్మరంధ్రాలను బిగించే అల్బుమిన్‌ ఉంటుంది. దీంతో చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
  • సాల్మన్‌ చేపలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంట, ముడతలు, మొటిమలతో పోరాడుతాయి. చర్మాన్ని లోపలి నుంచి  హైడ్రేట్‌ చేయడానికి సహాయపడుతాయి. అవకాడో పండులలోని సహజనూనె చర్మాన్ని హైడ్రేట్‌ చేయడంలో సహాయపడుతుంది. ఇది వడదెబ్బకు చికిత్స చేయడంలో, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని రక్షిస్తుంది. 
  • పొప్పడిలోని అధిక యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. దీనిలోని విటమిన్‌ ఏ, పాపైన్‌ కొల్లాజెన్‌ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. పొప్పడి, దానిమ్మ జ్యూస్‌లు తాగడం వల్ల కూడా చర్మం కాంతివంతంగా మారుతుంది.
  • ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో విటమిన్‌ సి, విటమిన్‌ బి6, డైటరీ ఫైబర్‌ ఉంటాయి. ఇందులోని కెరోటినాయిడ్‌ కంటెంట్‌ ముడతల్ని నివారించడానికి, రక్త ప్రసరణను పెంచడానికి సాయపడుతుంది. వారంలో కనీసం రెండుసార్లు ఎరుపు రంగు క్యాప్సికమ్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం మెరుస్తుంది.


logo