శనివారం 04 జూలై 2020
Food - Jun 26, 2020 , 15:20:22

ఆహారాన్ని న‌మ‌ల‌కుండా మింగేస్తున్నారా? అయితే.. స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు!

ఆహారాన్ని న‌మ‌ల‌కుండా మింగేస్తున్నారా? అయితే.. స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు!

బిజీ లైఫ్ కార‌ణంగానో.. అలానే అల‌వాటు అవ్వ‌డం వ‌ల్ల‌నో చాలామంది ఆహారాన్ని న‌మ‌ల‌కుండా మింగేస్తున్నారు. దీనివ‌ల్ల అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోండి. 

*  తొందర తొందరగా ఆహారం తినడం వల్ల కడుపు నిండిండో లేదో అర్థంకాదు. అలాగే ఇంకా ఏమైనా తినాలా లేదంటే ఆపేయాలా అనే సంకేతాలు సరైన సమయంలో మీ మెదడుకు చేరవు.

*  ఇలా తిన‌డం వ‌ల్ల ఓవర్ ఈటింగ్ సమస్యకు దారితీస్తుంది. దీంతో శరీరానికి పోషకాలు సరిగా లభించవు. అంతేకాకుండా ఎంత తింటున్నారో అర్థంకాదు.  దీన్నేఓవర్ ఈటింగ్ అంటారు. దీనివల్ల బరువు పెర‌గ‌డం ఖాయం.

* ఇది జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. కొంత‌మంది నీళ్లు ఎక్కువ తాగి భోజనం చేస్తారు. అప్పుడు ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో సమస్యలు పెరిగి అదికాస్తా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

* ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌డానికి కూడా ఇది కార‌ణంగా మారుతుంది. ఆపై ఇన్సులిన్‌ను నియంత్రించలేక స‌మ‌స్య పెరుగుతుంది. ఇది కాస్త తొంద‌ర‌లో డ‌యాబెటిస్ వ్యాధి బారిన ప‌డేలా చేస్తుంది.  

* ఫాస్ట్‌గా తిన‌డం వ‌ల్ల డైట్‌కు కూడా భంగం క‌లుగుతుంది. కాబ‌ట్టి తినేట‌ప్పుడు స‌రిగ్గా న‌మిలి తింటే శ‌రీరానికి స‌రైన పోష‌కాలు అంది ఎలాంటి స‌మ‌స్య‌లు ద‌రిచేర‌కుండా చేస్తుంది.  



logo