ఆదివారం 05 జూలై 2020
Food - Jun 08, 2020 , 22:55:58

టీ, కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది.?

టీ, కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది.?

టీ, కాఫీ తాగిన వెంటనే నీళ్లు అడిగితే పెద్దవాళ్లు వద్దంటారు. అలా చేస్తే పళ్లు ఊడిపోతాయని చెబుతుంటారు. టీ, కాఫీ కంటే ముందే నీళ్లు తాగమని చెబుతారు. మరీ రెండిటికి వ్యత్యాసం ఏంటి.? నిజంగానే పళ్లు ఊడిపోతాయా.? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. కొందరికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అవి తాగితే తప్ప వారు ఆ రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. తలనొప్పి ఉన్నా, అలసట ఉన్నా చాలా మంది టీ తాగి రిలాక్స్‌ అవుతారు. కొందరికి టీ తాగిన తర్వాత నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల పెద్దగా నష్టమేమి ఉండదని  నిపుణులు చెబుతున్నారు. వేడి వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే అవి పళ్లను కదిలిస్తాయని, దీని ద్వారా పళ్లు ఊడిపోతాయాని కొందరు అంటుంటారు. దాని గురించి అంత భయం అక్కరలేదు.

అంతగా అనుమానం ఉంటే టీ, కాఫీ తాగిన ౩ నిమిషాల తర్వతా నీళ్లు తాగండి. అలాగే టీ తాగే ముందు నీళ్లు తాగినా మంచిదే. టీ, కాఫీలో కెఫీన్‌తో పాటు ఫ్లోరైడ్‌ కూడా ఎక్కుగా ఉంటుంది. అలాగే పళ్లను గార పట్టించే టానిన్‌ పదార్థాలు ఉంటాయి. కాబట్టి టీ తాగిన తర్వాత నీళ్లతో నోటిని పుక్కలించడం మంచిది. టీ, కాఫీ, పాలు, నీళ్లు వేడిగా తీసుకోకుడదు. అవి తాగే ముందు కొన్ని నీళ్లు తాగితే ప్రమాదం తప్పుతుంది. ముందే నీళ్లు తాగడం వల్ల నాలుక మీద ఉన్న టేస్ట్‌ బడ్స్‌ దిబ్బ తినకుండా ఉంటాయి. టీ లో కెఫిన్‌, ధియామిన్‌ రసాయనాలు ఉంటాయి. టీ తాగే ముందు లేదా తర్వాత నీళ్లు తాగితే ఆ విషతుల్యాలు మూత్రం రూపంలో బయటకు వెళ్లేందుకు వీలుంటుంది.logo