శనివారం 31 అక్టోబర్ 2020
Food - Sep 30, 2020 , 20:41:52

అరటి పండు గురించి అపోహలా....?

 అరటి పండు గురించి అపోహలా....?

హైదరాబాద్ :అరటి.. ప్రపంచంలో ఎక్కువగా తినే పండు. అన్ని పండ్ల కంటే మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటి పండు. అరటి పండు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటి వల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అందుతాయి. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలోనూ దీనికి సాటిలేదు. ఇదిలా ఉండగా, చాలా మందిలో అర‌టిపండ్ల‌ను గురించి కొన్ని అపోహ‌లు ఉన్నాయి. దీంతో ఈ పండును పక్కనపెట్టేస్తారు.

-  బీపీ ఉన్నవారు అరటిపండ్లు తింటే హైబీపీ వస్తుందని సందేహ పడుతుంటారు. కానీ అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్‌ చేస్తుంది. గుండె జబ్బుల ముప్పు ను తప్పించడంలో సహకరిస్తుంది.  చాలామంది అర‌టి పండ్ల‌ను ఎక్కువ‌గా తింటే బ‌రువు పెరుగుతామ‌ని భయపడుతూ ఉంటారు. అయితే, ఇందులో పెక్టిన్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి తిన్నవెంటనే కడుపునిండిన ఫీలింగ్‌ కలుగుతుంది. అంతేకానీ అరటిపండ్లను తింటే బరువు పెరుగరు. పొట్ట కూడా రాదు. అర‌టిపండ్ల‌లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. కానీ వాటిలో ఉండే ప‌లు ఔష‌ధ గుణాలు మ‌న శ‌రీరంలోని మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో మ‌న‌కు ఉప‌యోగ‌మే త‌ప్ప న‌ష్టం ఉండ‌దు. 

-షుగ‌ర్ ఉన్న‌వారు కూడా నిర‌భ్యంత‌రంగా అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. అయితే తక్కువగా తినాలి. ఆహారం తక్కువగా తీసుకునేవారు అరటిపండ్లను తినవచ్చు. మధుమేహంతో బాధపడేవారు దీన్ని పక్కనపెట్టడానికి ప్రధాన కారణం ఇందులో చక్కెర ఉంటుందని. అయితే ఇందులో ఉండే చక్కెర ఫ్రక్టోజ్‌. ఇది సహజసిద్ధమైనది. కనుక డయాబెటిస్‌ రోగులకు ఇది హాని చేయదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.