గురువారం 04 మార్చి 2021
Food - Jan 23, 2021 , 16:44:29

బర్డ్‌ ఫ్లూతో భయాందోళనలు వద్దు

బర్డ్‌ ఫ్లూతో భయాందోళనలు వద్దు

సాధారణంగా బర్డ్ ఫ్లూ అని పిలిచే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కేసులను ఢిల్లీ, ముంబైతో పాలు పలు రాష్ట్రాలు నిర్ధారించాయి. నివారణ చర్యగా గుడ్లు, కోడికూర అమ్మకాలను కొన్ని ప్రభుత్వాలు నిషేధించగా.. ఇప్పుడిప్పుడే నిషేధాన్ని నెమ్మదిగా ఎత్తివేస్తున్నారు. అయితే ఫ్లూ చుట్టూ చాలా గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో భారతదేశ ఆహారం, ప్రమాణాల అథారిటీ (ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐ) చికెన్, కోడి గుడ్లను సరైన మార్గంలో తినడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. బర్డ్ ఫ్లూ భయపెట్టే సమయంలో పౌల్ట్రీ మాంసం, గుడ్లను సురక్షితంగా నిర్వహించడం, ప్రాసెస్ చేయడం, వినియోగించడంపై 10 మార్గదర్శకాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. గుడ్లు, పౌల్ట్రీ సాధారణ వినియోగదారులలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ మార్గదర్శాకలను జారీ చేశారు. దాదాపు 3 సెకండ్ల పాటు 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద చికెన్‌ను ఉడికించినట్లయితే వైరస్‌ నాశనం అవుతుందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టంచేసింది. 

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్గదర్శకాలు

1. సగం ఉడికించిన గుడ్డు తినకూడదు.

2. అండర్‌ కుక్డ్ చికెన్ తినకూడదు.

3. వ్యాధి సోకిన ప్రాంతాల్లో పక్షులతో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించాలి.

4. చనిపోయిన పక్షులను చేతులతో తాకడం మానుకోవాలి.

5. పచ్చి మాంసాన్ని బహిరంగంగా ఉంచకూడదు.

6. ముడి మాంసంతో ప్రత్యక్ష సంబంధం ఉండకూడదు.

7. చికెన్ కోసే సమయంలో మాస్క్‌, గ్లౌవ్స్‌ వాడాలి.

8. తరచుగా చేతులు కడుగుతుండాలి.

9. పరిసరాల శుభ్రతను కాపాడుకోవాలి.

10. ఉడికించిన తర్వాతనే చికెన్, గుడ్లు తినాలి.

డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు

ఏ ఆహారం అయినా సరిగ్గా ఉడికించినట్లయితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తుంటారు. కోడి మాంసం, గుడ్లను బాగా ఉండికించడం ద్వారా వాటి లోపల ఉన్న వైరస్‌ను క్రియారహితం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ధ్రువీకరించింది. డబ్ల్యూహెచ్‌ఓ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా పుకార్లను వ్యాప్తి చేయకుండా హెచ్చరించింది. వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మానవుల్లో వ్యాధి వ్యాప్తి చెందుతుందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని, చెల్లుబాటయ్యే ఎపిడెమియోలాజికల్ డాటా కూడా లేదని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

ఇది కూడా చదవండి..

24న భారత్‌-చైనా తొమ్మిదో రౌండ్‌ చర్చలు

ల్యాండ్‌ మాఫియాపై చర్యలు తీసుకోండి: మెహబూబా ముఫ్తీ

ఇది అత్యత్తమ పోలీస్‌ శిక్షణ కళాశాల

మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo