మంగళవారం 26 మే 2020
Food - May 02, 2020 , 08:26:11

వేడివేడి టీ, కాఫీలు తాగితే క‌రోనా చ‌చ్చిపోతుందా..?

వేడివేడి టీ, కాఫీలు తాగితే క‌రోనా చ‌చ్చిపోతుందా..?

హైద‌రాబాద్: క‌రోనా మ‌హ‌మ్మారి నోరు, ముక్కు ద్వారా లోపలికి ప్ర‌వేశించి మూడు రోజుల‌పాటు అక్క‌డే ఉంటుందంట‌. ఈ స‌మ‌యంలో వేడివేడి టీ, కాఫీలు తాగితే వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయొచ్చ‌ట‌. ఎందుకంటే వేడి ఎక్కువ‌గా ఉన్న చోట క‌రోనా వైర‌స్‌ బ‌తుక‌ద‌ట‌. వేడిగా ఉన్న‌ టీ, కాఫీలు తీసుకున్న‌ప్పుడు వైర‌స్ శ్వాసనాళం నుంచి పొట్ట‌లోకి వెళ్తుంద‌ట‌. అక్క‌డి అన్నవాహిక‌లో విడుద‌ల‌య్యే గ్యాస్‌ల ధాటికి వైర‌స్ చ‌చ్చిపోతుంద‌ట‌. గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో ఇలాంటి ప్ర‌చారాలు జోరుగా సాగుతున్నాయి. 

కానీ, ఇవ‌న్నీ ఒట్టి పుకార్లేన‌ని కొట్టిపారేస్తున్నారు వైద్యులు. ఇలాంటి పుకార్ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని చెబుతున్నారు. వేడిగా ఉన్న టీ, కాఫీలు తాగ‌డంవ‌ల్ల కరోనా వైర‌స్ క‌ట్ట‌డి అవుతుంద‌నేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు. సాధారణంగా మన శరీరంలో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్ర‌త ఉంటుంద‌ని, అంత వేడిలోనూ క‌రోనా వైర‌స్‌ బ‌తికే ఉంటున్న‌ప్పుడు వేడి పానీయాలు తాగ‌డంవ‌ల్ల చ‌నిపోతుంద‌నడంలో ఏ మాత్రం నిజం లేద‌ని వైద్యులు స్ప‌ష్టంచేస్తున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo