Food
- Dec 14, 2020 , 18:33:48
రోజుకొక టమాటా తింటే ఏమవుతుందో తెలుసా?

హైదరాబాద్: రోజుకొక యాపిల్ తింటే డాక్టరు దగ్గరికి వెళ్లే అవసరం రాదని తెలుసు. అయితే, యాపిల్లాగా రోజుకొక టమాటాను తిన్నా అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే టమాటాను సూపర్‌ఫుడ్ జాబితాలో చేర్చారు. దీంతో ఉన్న అద్భుత ప్రయోజనాలే ఇందుకు కారణం. టమాటాలు కాన్సర్ రాకుండా అడ్డుకోవడమే కాదు... చర్మ సంరక్షణకు తోడ్పడుతాయి. అధిక బరువును తగ్గిస్తాయి. గుండెకు మేలు చేస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు..
- టమాటాలు తింటే కాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది.
- డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా టమాటాలు దోహదపడతాయి.
- టమాటాల్లో కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి కంటిని సంరక్షిస్తాయి. రేచీకటి రాకుండా చూస్తాయి.
- వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
- టమాటాల్లో ఫైబర్, నీరు ఎక్కువశాతంలో ఉంటాయి. మలబద్ధక సమస్యను నివారిస్తాయి.
- టమాటాలను క్రమంతప్పకుండా తింటే మూత్రాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి.
- గర్భిణులకు టమాటాలు చాలా మేలు చేస్తాయి.
- టమాటాల్లో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి. అందువల్ల టమాటాలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
- టమాటో బలమైన ఎముకల నిర్మాణానికి తోడ్పడుతుంది. వీటిలోని విటమిన్ కే, కాల్షియం రెండూ ఎముకలను బలోపేతం చేసేందుకు, మరమ్మతు చేసేందుకు చాలా దోహదం చేస్తాయి. ఇందులోని లైకోపిన్ అనే పదార్థం ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అలాగే, బోలు ఎముకల వ్యాధితో పోరాటానికి సహకరిస్తుంది.
- టమాటాల్లో క్రోమియం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెరను సమతుల్యంగా ఉంచడంలో టమాటా సమర్థవంతమైన పాత్ర పోషిస్తుంది.
- జుట్టును అందంగా కనపించేలా చేయడంలో టమాటా పాత్ర ముఖ్యమైనది. టమోటాలతో లభించే విటమిన్ ఏ జుట్టు బలంగా, మెరిసేలా పనిచేస్తుంది.
- టమాటా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే నీరు, ఫైబర్ బరువును తగ్గిస్తాయి. కేలరీలు నియంత్రించడంలో ఇది పనిచేస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వైట్‌హౌస్ ముందు బైడెన్‌కు తొలి అపశృతి!
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
MOST READ
TRENDING