శనివారం 06 మార్చి 2021
Food - Jan 25, 2021 , 19:51:54

జలుబు చేసినప్పుడు పెరుగు తింటున్నారా..

జలుబు చేసినప్పుడు పెరుగు తింటున్నారా..

జబ్బుగా ఉన్నప్పుడు.. జలుబు చేసినపుడు ఆహారం తీసుకోవడం ద్వారా రెమెడీ పొందొచ్చు. ముఖ్యంగా జలుబు విషయంలో ఆహారం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకే ఇలాంటప్పుడు ఏది తినాలో ఏది తినకూడదో అన్న అనుమానాలు చాలా మందికి కలుగుతుంటాయి. అయితే జలుబు చేసినప్పుడు విటమిన్- సీ కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అందడంతో పాటు జలుబు, ఫ్లూల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోగలం. ఎందుకంటే విటమిన్- సీ ఇమ్యూన్ సిస్టమ్ బూస్టర్ గా పనిచేయడమే కాకుండా.. శరీరానికి చాలా యాంటీ యాక్సిడెంట్లను అందిస్తుంది. ఫలితంగా అనారోగ్యం, జబ్బుల నుంచి బయటపడొచ్చు. ఇటువంటి ఆహారాల్లో ఒకటి పెరుగు (యోగట్అ) ని చెబుతున్నారు ఆహార నిపుణులు. జలుబు చేసినప్పుడు ఇది తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో కూడా వివరించారు..

సాధారణంగా యోగట్ ను జలుబు తగ్గించడానికి వాడతారు. కొంచెం తేడాగా అనిపించినా అది నిజమే. ఇది కేవలం డైరీ ఉత్పత్తుల్లో ఒకటి అయినప్పటికీ అన్నింటిలా ముక్కు కారేలా చేయదు. 

యోగట్‌లో ఉండే ప్రోబయోటిక్స్ 

ఇందులో ప్రోబయోటిక్స్ బాగా దొరుకుతాయి. అవి శరీరానికి సహకరించే బ్యాక్టీరియానే. శరీరారోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. బలాన్ని ఇస్తుంది.

జింక్ నుంచి వచ్చే నేచురల్ సోర్స్

జింక్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్. ఆల్రెడీ జలుబు, ఫ్లూ లాంటి సమస్యల నుంచి బయటపడేందుకు దోహదపడుతుందని తేలింది. యోగట్ లో ఉండే జింక్ అలాగే ఉపయోగపడుతుంది.

యోగట్‌లో ఉండే కార్బొహైడ్రేట్స్

 మీరు జబ్బుగా ఉన్నప్పుడు శరీరానికి శక్తిని అందజేయడంలో కార్బొహైడ్రేట్స్ బాగా ఉపయోగపడతాయి. జలుబుకు దోహదపడే పరిస్థితులపై పోరాడుతుంది. అయినప్పటికీ యోగట్ చాలా న్యూట్రియంట్లను అందిస్తుంది. వాటి నుంచి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే యోగట్ అనేది జలుబుతో పోరాడే ప్రాథమిక ఫైటింగ్ సొల్యూషన్. చాలా మంది ట్రీట్ మెంట్ కోసం ఇతర పద్ధతులనే వాడుతుంటారు.

VIDEOS

logo