సోమవారం 13 జూలై 2020
Food - Jun 27, 2020 , 19:06:24

కందిప‌ప్పు తింటే బ‌రువు పెరుగుతారా? త‌గ్గుతారా?

కందిప‌ప్పు తింటే బ‌రువు పెరుగుతారా? త‌గ్గుతారా?

ఉద్యోగాలు చేసేవాళ్లు, చేయ‌నివాళ్లు అంద‌రూ నెల‌వారి సామాన్లు ఒక‌సారే తెచ్చుసుకుంటారు. స‌రుకుల్లో మొట్ట‌మొద‌టి వ‌స్తువు కందిప‌ప్పు ఉండ‌డం విశేషం. నాన్‌వెజ్ ప్రియులు, వెజ్ ప్రియులు అంద‌రూ కందిప‌ప్పును ఇష్ట‌ప‌డ‌కుండా ఉండ‌లేరు. కాక‌పోతే కందిప‌ప్పుతో చేసిన ప‌ప్పు రెసిపీ తింటే లావు అవుతారు. అస‌లే లాక్‌డౌన్ ఇంట్లో కూర్చొని ప‌ప్పు తింటుంటే ఇక అంతే.. ప‌ప్పు అంత‌గా తిన‌క‌పోవ‌డ‌మే మంచిది అంటుంటారు. మ‌రి ఇది ఎంత మాత్రం నిజం అన్న స‌న్నిగ్దంలో ఉండ‌గా  నిపుణులు కొన్ని విష‌యాలు చెప్పుకొచ్చారు. కందిప‌ప్పు వ‌ల్ల అన్నీ ప్ర‌యోజ‌నాలే. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ‌ని నిర్థారించారు. ఇంకేం అన్నారంటే..

* కందిప‌ప్పులో  ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. 

* దీంతోపాటు కొలెస్ట్రాల్, సాచ్యురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటాయి.

* ప్రొటీన్ ఆరోగ్యానికి మందిది. శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను బ‌య‌ట‌కు పంపించేందుకు ఫైబ‌ర్ దోహ‌ద‌ప‌డుతుంది. 

* ప‌ప్పుతో భోజనం చేస్తే సంపూర్ణంగా క‌డుపు నిండుతుంది. మ‌ర‌లా అంత తొంద‌ర‌గా కూడా ఆక‌లి అనిపించ‌దు. 

* కంది పప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. అందువల్ల దీన్ని డయాబెటిక్స్ కూడా హాయిగా తినచ్చు. 

* ఇందులో ఉండే ఫైబ‌ర్ బ్లోటింగ్ లాంటి సమస్యల‌ను  రాకుండా చేస్తుంది. 

* కంది పప్పులో ఉండే బీ కాంప్లెక్స్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మెగ్నీషియం వల్ల దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. 

* కంది పప్పు తో ముద్దపప్పు, కంది పచ్చడి, కంది పొడి లాంటి వంటకాలు ఈజీగా చెయ్యచ్చు. పైగా కంది పప్పు కి ఉన్న రుచి ఇంకే పప్పుకీ రాదు. logo