మంగళవారం 26 మే 2020
Food - Apr 18, 2020 , 13:27:12

రాత్రులు ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారా?

రాత్రులు ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారా?

క్వారెంటైన్‌లో వండుకోవ‌డం తిన‌డం త‌ప్ప మ‌రేం ప‌ని లేదంటున్నారు కొంద‌రు మ‌హిళ‌లు. మొత్తం కుటుంబాన్ని చూసుకోవాలంటే ఆ ఇంటి య‌జ‌మానురాలు దృఢంగా ఉండాలి. అప్పుడే ఆమె అంద‌రినీ క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్ట‌గ‌ల‌దు. మ‌రి దృఢంగా ఉండాలంటే బాగా తినాలి క‌దా అంటారేమో. తినాలి .. కానీ ఎప్పుడు  తినాలి అనేది ముఖ్యం. ప‌గ‌లు ఎంత తిన్నా ప‌ర్వాలేదు కాని రాత్ర‌లు మాత్రం ఎక్కువ క్యాల‌రీలు ఉన్న ఆహారం తీసుకోవ‌కూడ‌దు. వీలైనంత వ‌ర‌కు త‌క్కువ మోతాదులో తీసుకోవాలి. లేదంటే కుటుంబాన్ని స‌రిదిద్ద‌డం ఏమో గాని అంద‌రూ క‌లిసి మీకు సేవలు చేయాల్సి వస్తుంది. రాత్రిపూట ఎక్కువ కేలరీలున్న ఆహారం తింటే ఏమౌతుందో పరిశోధనలో తేలిన నిజాలు..

1. సాయంత్రం 6 గంటల తరువాత అధికంగా తినే మహిళలకు గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చారు. 

2. సగటున 33 ఏళ్ల వయసున్న 112 మంది మహిళలపై అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. 

3. తమ పరిశోధనలో భాగంగా వారు ఆ మహిళల బీపీ, షుగర్ స్థాయిలను ఏడాది పాటు పరిశీలించారు.

4. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తరువాత అధిక కేలరీలున్న ఆహారాన్ని అధికంగా తీసుకునే మహిళల్లో కొలెస్ట్రాల్  స్థాయులు విపరీతంగా పెరిగాయి. 

5. వారిలో గుండె సంబంధిత జబ్బులతో పాటు బీపీ, షుగర్ పెరిగింది. దీంతో వారికి గుండె పోటు వంటివి వచ్చే ప్రమాదం అధికమని పరిశోధకులు తెలిపారు. సాయంత్రం పూట తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు. 

చూశారుగా రాత్రిపూట అధికంగా ఆహారం తీసుకుంటే ఏం జ‌రుగుతుందో.. ఇప్ప‌టికైనా జాగ్ర‌త్త మ‌హించండి.


logo