ఈ పనులు భోజనం తర్వాత చేయొద్దు...!

హైదరాబాద్ : భోజనం చేసిన తర్వాత కొంతమంది కొన్ని పనులు చేస్తుంటారు. వీటిలో భాగంగా కొందరు ఎక్కువగా నీరు తాగుతుంటారు. ఇంకొందరు స్మోకింగ్ చేస్తారు. మరికొందరు శీతల పానీయాలు, పండ్ల రసాలు సేవిస్తారు. అయితే వాస్తవంగా భోజనం చేశాక చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయట. అనేంటంటే..
-భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయకూడదు. టీ, కాఫీలు తాగరాదు. అలాగే ఎక్కువ సేపు కూడా కూర్చో కూడదు. కొంత సేపు అటు, ఇటు నడవాలి. అలాగే తిన్న వెంటనే నిద్రించరాదు. గ్యాస్ట్రిక్ సమస్య రావడమేకాకుండా,అధికంగా బరువు పెరుగుతారు.
-భోజనం చేసిన వెంటనే స్నానం కూడా చేయరాదు. చేస్తే జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతోపాటు గ్యాస్, అసిడిటీ వస్తాయి. అయితే భోజనం చేశాక స్నానం చేద్దామనుకుంటే కనీసం 40 నిమిషాల వరకు అయినా ఆగితే మంచిది. దీంతో ఆరోగ్యంపై అంత ప్రభావం పడకుండా ఉంటుంది.
-చాలా మంది భోజనం చేసిన వెంటనే పలు రకాల పండ్లు తినకూడదు. ఎందుకంటే మనం తిన్నఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించాలంటే పండ్లను తినరాదు. అయితే పండ్లను తినాలంటే భోజనం చేశాక కనీసం 60 నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఇలా పండ్లను తింటే ఏమీ కాదు.
-భోజనం చేశాక గ్రీన్ టీ తాగరాదు. తాగితే శరీరం మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను సరిగ్గా గ్రహించలేదు. కనుక భోజనం చేశాక గ్రీన్ టీ కూడా తాగకూడదు.
-భోజనం చేశాక ఎట్టి పరిస్థితిలోనూ స్మోకింగ్ చేయరాదు. చేస్తే పొగాకులో ఉండే నికోటిన్ మన శరీరంలో జరిగే జీర్ణ క్రియను అడ్డుకుంటుంది. అలాగే శరీరం క్యాన్సర్ కణాలను గ్రహించి క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కనుక భోజనం చేశాక పొగ తాగరాదు.ప్రజలకు ధన్ తేరస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.