పండ్లు, కూరగాయల తొక్కలను ఇలా ఉపయోగించుకోవచ్చు తెలుసా.?

సాధారణంగా ఆపిల్, నిమ్మకాయలు, పుచ్చకాయలు, నారింజ పండ్లను తిని తొక్కలు పడేస్తుంటాం. వీటితోపాటు బంగాళాదుంపలు, దోసకాయలు తదితర రకాల కూరగాయల తొక్కలను సైతం చెత్తబుట్టలోనే పడేస్తుంటాం. అలా కాకుండా వీటిని వినూత్న పద్ధతిలో ఉపయోగించగలిగితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా.. ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలు, పండ్ల తొక్కలను ఉపయోగించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే..
1. ఆరెంజ్, నిమ్మకాయ తొక్కలను స్నానం చేసే వేడి నీటిలో పడేయండి. ఇది నీటికి తాజాదనాన్ని, క్రిమిసంహారక గుణాన్ని ఇస్తుంది. ఈ నీటితో స్నానం చేయడం వల్ల రోజంతా మీరు రిఫ్రెషింగ్‌గా, శక్తివంతం కనిపిస్తారు.
2. మామూలుగా పక్షులకు ఆహారం పెడుతుంటారు కదా... పండ్ల తొక్కలతో పక్షులకు ఆహారం పెట్టే కప్పులను తయారు చేయవచ్చు. ఈ కప్పుల్లో విత్తనాలు, ధాన్యాలు వేసి ఉంచచ్చు.
3. కూరగాయలు, పండ్ల తొక్కల్లో చాలా పోషక విలువలుంటాయి. వీటితో ఫేస్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. పండ్ల తొక్కలకు కొన్ని ముతక చక్కెర కణికలు, తేనె, ఆలివ్ నూనె వేసి కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత దీన్ని చర్మంపై రాసుకుని, 10 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో కడగాలి.
4. బంగాళాదుంప తొక్కలతో చిప్స్ తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంప తొక్కలను తీసుకుని శుభ్రంగా కడిగి.. నూనెలో వేయించుకోవచ్చు.
5. దంతాలు తెల్లబడటానికి నారింజ తొక్కలు బాగా ఉపయోగపడతాయి. తొక్కలు ఎండబెట్టి వాటిని దంతాలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల దంతాలు ప్రకాశవంతంగా, తెల్లగా మారతాయి.
6. చీమలను దూరంగా ఉంచడానికి దోసకాయ తొక్కలను ఉపయోగించవచ్చు. చీమల వచ్చే ప్రదేశంలో దోసకాయ తొక్కలను ఉంచండి. దోసకాయ వాసనకు చీమలు రావు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అత్త అంత్యక్రియలకు వచ్చి.. అల్లుడు మృతి
- ఆ రాష్ట్రాల నుంచి వస్తే నెగెటివ్ సర్టిఫికెట్ ఇవ్వాలి : సీఎం
- భూ తగాదాలు.. అన్నను హత్య చేసిన తమ్ముళ్లు
- గొర్రెలకు హాస్టళ్లు.. ఎక్కడో తెలుసా?
- మహిళపై దాడి కేసు.. వ్యక్తికి మూడేండ్ల జైలు
- బోనస్ ఆశచూపి.. ముంచేస్తారు..
- వెలుగులోకి మరో చైనీయుల కుంభకోణం
- మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి
- మహిళా పోలీస్ సేవలు భేష్
- అమ్మ లేనిదే ప్రపంచం లేదు.. ఆమె కీర్తి ప్రగతికి స్పూర్తి