మంగళవారం 20 అక్టోబర్ 2020
Food - Sep 18, 2020 , 17:05:03

ప‌క్ష‌వాతం బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఈ నీటితో స్నానం చేస్తే స‌రి!

ప‌క్ష‌వాతం బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఈ నీటితో స్నానం చేస్తే స‌రి!

వ‌య‌సు మీద ప‌డుతున్న స‌మ‌యంలోనే  కొంత‌మందిని ప‌క్ష‌వాతం వ‌చ్చి ప‌ల‌క‌రించి పోతుంటుంది. ప‌క్ష‌వాతం వ‌స్తే దాన్ని నుంచి కోలుకోవ‌డానికి ఏండ్ల స‌మ‌యం ప‌డుతుంది. లేదంటే చ‌నిపోయేంత‌వ‌ర‌కు దాని ల‌క్ష‌ణాలు అలానే ఉంటాయి. మ‌రి దీని బారి నుంచి తప్పించుకోలేమా అంటే.. ఉంది. వేడి నీటితో స్నానం చేయ‌డ‌మే. ఈ విష‌యంపై ప‌రిశోధ‌న చేసిన త‌ర్వాతే జ‌పాన్ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. 

ప్ర‌తిరోజూ గోరువెచ్చ‌ని నీటితో స్నానం చేస్తే గుండె జ‌బ్బుల‌ను నిరోధించ‌డంతోపాటు ప‌క్ష‌వాతం బారిన ప‌డే ప్ర‌మాదం కూడా త‌క్కువ‌గా ఉంటుందంటున్నారు. ఈ ప‌రిశోధ‌న సుమారు 20 ఏండ్ల‌పాటు 30 వేల‌మందిపై అధ్య‌యనం చేశారు. దీని ద్వారా ఒక విష‌యాన్ని తెలుసుకున్నారు. వేడి నీటితో స్నానం చేయ‌డం, ఏరోబిక్స్ చేసిన దానితో స‌మానమ‌ట‌. ప‌క్ష‌వాతం ఎక్కువ‌గా చ‌న్నీళ్లతో చేసేవారిలో వ‌స్తుంద‌ని తెలుసుకున్నారు. వేడి నీటితో చేస్తే ప‌క్ష‌వాత ప్ర‌మాదం 26 శాతం వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని గుర్తించారు. 


logo