మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలు తప్పనిసరి.. !

మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారమే సహాయపడుతుంది. ఈ ఆరు పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే చాలు ఆరోగ్యం గురించి ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ ఆహారం తీసుకునే వారిలో విటమిన్ ఎ, విటమిన్ బి 12, క్యాల్షియం, ఐరన్, ఫోలెట్, విటమిన్ డి వంటి పోషకాలు లోపిస్తాయి. అందుకే పోషకాహార ప్రాముఖ్యత గురించి ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. మరి ఆ పోషకాలేంటి. అవి ఏ ఆహారంలో ఎక్కువగా దొరుకుతాయో తెలుసుకోండి.
విటమిన్ బి 12 : ఇది మెదడు పనితీరు, ఎర్రరక్త కణాల ఉత్పత్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు మొదలైన వాటిలో విటమిన్ బి 12 లభిస్తుంది. ఇది తక్కువ స్థాయిలో ఉండకుండా చూసుకకోవాలి. నాన్‌వెజ్ తినని వారు సప్లిమెంట్ల రూపంలో విటమిన్ 12ను పొందవచ్చు.
విటమిన్ డి : ఇది న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి అవసరం. ఇది తక్కువగా ఉంటే నిరాశ, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య లక్షణాలకు దారితీస్తుంది. విటమిన్ డి వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది గుడ్డుసొన, చేపలు, జున్ను, తృణధాన్యాలు మొదలైన వాటి నుంచి పుషల్కంగా లభిస్తుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు : ఇవి మెదడుకు మేలు చేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలోపం వల్ల నిరాశ, ఆందోళన, దృష్టిలోపం వంటి వాటికి దారి తీస్తుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సార్డినెస్, సాల్మన్, మాకేరెల్ వంటి చేపల ద్వారా లభిస్తుంది.
మెగ్నీషియం : శరీరానికి మెగ్నీషియం చాలా అవసరం. ఇది తక్కువ స్థాయిలో ఉండకుండా చూసుకోవాలి. దీనివల్ల భయాందోళనలు, నిద్రలేమి, చిరాకు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఆకుకూరలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, కాయలు, విత్తనాలు, డార్క్ చాక్లెట్స్, చేపలు వంటి వాటిలో మెగ్నిషియం సమృద్దిగా దొరుకుతుంది.
సెలీనియం : సెలీనియం అనే ముఖ్యమైన ఖనిజం శరీరానికి చాలా అవసరం. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. చికెన్, టర్కీ, చేపలు, గుడ్లు, కాటేజ్ చీజ్, పాలు,పెరుగు, బ్రెజిల్ కాయలు, బచ్చలికూర, అరటి, పుట్టగొడుగులు మొదలైన వాటి నుంచి సెలీనియం దొరుకుతుంది.
జింక్ : ఇది ఆకలిని తగ్గిస్తుంది. పనులు చేయడానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. మాంసం, చిక్కుళ్లు, తృణధాన్యాలు, గుడ్లు, పాల పదార్థాలు, కాయలు, విత్తనాలు మొదలైన వాటి నుంచి జింక్ పుష్కలంగా దొరుకుతుంది.
పోషక విలువలున్న ఆహారం తినడం. తగినంత నిద్రపోవడం. ఒత్తిడికి గురవ్వకుండా ఉంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
తాజావార్తలు
- మార్కెటింగ్ శాఖలో 32 మంది ఉద్యోగులకు పదోన్నతి
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- ఎస్ఈసీకి సీఎస్ ఆదిత్యానాథ్ మూడు పేజీల లేఖ
- కన్న తల్లిని కొట్టి చంపిన తనయుడు
- 24న వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో సీఎం సమీక్ష
- ట్రంప్ వాడే ‘రెడ్ బటన్’ తొలగించిన బైడెన్
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!