మంగళవారం 19 జనవరి 2021
Food - Dec 17, 2020 , 21:39:31

కుక్కలు తినే ఆహారం మనుషులకు పనికొస్తుందా..?

కుక్కలు తినే ఆహారం మనుషులకు పనికొస్తుందా..?

హైదరాబాద్‌: కుక్కలు తినే పెడిగ్రీలాంటి ఆహారం మనం తినొచ్చా? అని చాలామందికి డౌట్‌ వచ్చి ఉంటుంది. ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు కుక్కల కోసం తెచ్చిన ఐటమ్స్ మనం కూడా తింటే ఏమవుతుందని సరదాగానైనా మనం అనుకుని ఉంటాం. దీనికి మా దగ్గర సమాధానముంది. ఇది చదవండి.. కుక్కల ఆహారం మనుషులు తీసుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసుకోండి. మనుషుల ఆహారం క్కుక్కలు తింటున్నట్లే.. వీటి ఆహారాలు కూడా మనుషులు తినొచ్చట. అయితే కొన్ని కండిషన్లు ఉన్నాయట.. అవేంటంటే. కుక్కల ఆహారం మనుషుల ఆహారానికి సమానంగా ఉండదు. దాని ప్రొడక్షన్ విలువలు మనుషులు తినే ఆహార పదార్థాలకు భిన్నంగా ఉంటాయి. కాబట్టి కొద్దిరోజులయితే పరవాలేదు కానీ.. రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా పెద్ద సమస్యలు రావొచ్చు అంటున్నారు నిపుణులు. 

కుక్కల ఆహారాన్ని జంతువుల శరీర భాగాల నుంచి తయారుచేస్తుంటారు. గోధుమలు, సోయాబీన్స్, విటమిన్లు, మినరల్స్‌లాంటి వాటికి జంతువుల శరీరాల్లోని పదార్థాలను కలిపి బ్యాలెన్స్‌డ్ డైట్‌గా రెడీ చేస్తారు. జంతువుల మాంసం, ఎముకలు, చర్మం, ఇతర అవయవాలు, విరిగిపోయిన జంతు శరీర భాగాలు కలిపి తయారుచేయడం వల్ల అవి మనుషులు తినడానికి సరిపడవు. అయినప్పటికీ చాలా మంది కొంతకాలంపాటు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రాకపోవచ్చు.  అదే కంటిన్యూ చేస్తే మాత్రం ఆరోగ్యంతో ప్రయోగం చేసినట్లే. పైగా కుక్కల ఆహారం మనుషులు తినాంటే.. వాటిని సరైన పద్ధతిలో ఉడకబెట్టడం, కరెక్ట్‌గా నిల్వ ఉంచుకోవడం లాంటివి చేస్తుండాలి. 

నిజానికి కుక్కల ఆహారంలో మెనోడియోన్ అనే పదార్థం విటమిన్-కే అందిస్తుంది. అది కుక్కలకు చాలా సేఫ్ కూడా. కానీ ఇది మనుషులకు ఎక్కువ డోసులలో వెళితే ప్రమాదకరం. అలాగే, మనుషులు, కుక్కలకు విభిన్నమైన న్యూట్రిషన్లు అవసరం. అవి మనుషులు తినే ఆహారం సమానస్థాయిలో తినలేవు. కారణం వాటికి మనుషులతో పాటు సమానమైన న్యూట్రిషన్లు అవసరముండదు. అవి సేఫ్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ అవసరం లేదు కూడా..ఉదాహరణకు విటమిన్ సీ తీసుకుందాం.. విటమిన్ సీ అనేది తప్పక తీసుకోవాల్సిన న్యూట్రియంట్. మన చర్మానికి, ఇమ్యూన్ ఫంక్షన్‌కు అది కీలకం. అది మనిషి శరీరంలో తయారు కాదు కాబట్టి ఆహారం నుంచే తప్పకుండా తీసుకోవాలి. కానీ, కుక్కలు స్వయంగా ఉత్పత్తి చేసుకోగలవు. వాటి లివర్ నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అందుకే వాటి ఆహారంలో విటమిన్ సీ ఉండదు. అలా.. న్యూట్రిషన్ కోసం మాత్రమే కుక్కల ఆహారం తీసుకుందామనుకుంటే ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసినట్లే.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.