బుధవారం 28 అక్టోబర్ 2020
Food - Sep 30, 2020 , 20:38:37

మ‌నిషి రోజుకు ఎన్ని గ్రాముల ఉప్పు తినాలంటే..!

మ‌నిషి రోజుకు ఎన్ని గ్రాముల ఉప్పు తినాలంటే..!

ఉప్పు త‌క్కువ అయినా ప‌ర్వాలేదు కాని ఎక్కువ కాకుండా చూసుకోవాలి. లేదంటే వండిన కూరంతా వేస్ట్ అవుతుంది. ఎక్కువైంది కొంచెం అయినా అది తిన‌డం వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌టం ఖాయం. ఉప్పు చ‌ర్మ‌వ్యాధుల బారిన ప‌డ‌కుండా చూస్తుంది. కానీ, అవ‌య‌వాల ప‌నితీరును దెబ్బ‌తీస్తుంది. జ‌ర్మ‌నీలోని బాన్ యూనివ‌ర్సిటీ నిర్వ‌హించిన తాజా ప‌రిశోధ‌న‌లో ఈ విష‌యం తేలింది. ఉప్పు అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు పెర‌గ‌డంతోపాటు ఇమ్యునిటీ ప‌వ‌ర్ కూడా త‌గ్గుతుంద‌ని వెల్ల‌డించారు.

అందుకే ఉప్పు విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఉప్పు కాస్త త‌క్కువైనా ప‌ర్వాలేదు. అందుకే ఒకేసారి కాకుండా ఎక్కువ తినేవాళ్లు రోజూ కొంచెం కొంచెం వాడ‌కాన్ని త‌గ్గించండి. అప్పుడు అల‌వాటు అవుతుంది. స‌రిగ్గా చెప్పాలంటే రోజుకు 5 గ్రా. ఉప్పు తీసుకునేలా చూసుకుంటే స‌రిపోతుంది. మోతాదుకి మించితే ఇన్ఫెక్ష‌న్ల ముప్పు ఎక్కువ‌గా ఉంటుంది. 

  


logo