మంగళవారం 19 జనవరి 2021
Food - Aug 28, 2020 , 19:21:11

ప్ర‌తిరోజూ పెరుగు తినేవారికి క‌రోనా రాద‌ట‌.. దీంతోపాటు ఆ విత్త‌నాలు కూడా తీసుకోవాలి!

ప్ర‌తిరోజూ పెరుగు తినేవారికి క‌రోనా రాద‌ట‌.. దీంతోపాటు ఆ విత్త‌నాలు కూడా తీసుకోవాలి!

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డానికి ప్ర‌తిఒక్క‌రూ తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. ఎప్పుడూ తిన‌ని కూర‌గాయ‌లు, పండ్ల‌ను తెచ్చుకొని మ‌రీ తింటున్నారు. వీటితో కొంత‌మేర‌కు రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఈ కొంచెం శ‌క్తి ఉంటే స‌రిపోదు. క‌రోనాను త‌ట్టుకోవాలంటే ఇంకా చాలా కావాలి. అందుకే ప్ర‌తిరోజూ తినే ఆహారంలో పెరుగును కూడా చేర్చుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు వీటి జాబితాలోకి పొద్దుతిరుగుడు గింజ‌లు కూడా చేరాయి.

* రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండే వారికే క‌రోనా సోకుతుంది అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాంట‌ప్పుడు ఆహార విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అందులో ముఖ్యంగా ప్ర‌తిరోజూ పెరుగు తిన‌డం మాత్రం మ‌ర్చిపోకూడ‌దంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* భార‌తీయులు ఆహారాన్ని పెరుగుతోనే ముగిస్తారు. అది లేకుండా భోజ‌నాన్ని పూర్తి చేయ‌లేరు. అంత ప్రాధాన్య‌త ఇచ్చే పెరుగు తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌య్యే మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది.

* పెరుగు ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌కు కావాల్సిన జింక్‌ను అందిస్తుంది. అంతేకాదు తిన్న ఆహారం జీర్ణమ‌వ్వ‌డానికి కూడా పెరుగు ఉప‌యోగ‌ప‌డుతుంది. 

* పెరుగును ఆహారంలోనే కాకుండా ర‌క‌ర‌కాల వంట‌ల్లో కూడా వాడొచ్చు. అలా తిన్నా ఆరోగ్యానికి మంచిదే.

* పెరుగును ఆహారంలోనే కాకుండా వ‌ట్టిగా తిన్నా బాగుంటుంది. కావాలంటే ఇందులో దానిమ్మ గింజ‌లు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది.   

* పెరుగు మాత్ర‌మే కాకుండా పొద్దుతిరుగుడు విత్త‌నాలు కూడా తినాలంటున్నారు నిపుణులు. ఈ విత్త‌నాల్లో విట‌మిన్ సి, ఈలు పుష్క‌లంగా దొరుకుతాయి.  

* పొద్దుతిరుగుడు విత్త‌నాలు తిన‌డం వ‌ల్ల ధ‌మ‌నుల్లో కొవ్వు పేరుకుపోకుండా ర‌క్త‌నాళాల‌ను క్లీన్ చేస్తాయి. దీంతోపాటు గుండె కూడా సుర‌క్షితంగా ఉంటుంది.

* ఈ విత్త‌నాల్లో జింక్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి తోడ్ప‌డుతుంది.

* విష వ్య‌ర్థాల‌ను అడ్డుకునే శ‌క్తి విత్త‌నాల్లోని కాప‌ర్‌, సెలీనియంలు తోడ్ప‌డుతాయి. 

*  అంతేకాదు ప్ర‌తిరోజూ ఆకు కూరలు, పీచు ప‌దార్థం ఉన్న కూర‌గాయ‌లు, పండ్లు, రోజుకు ఒక‌సారి అయినా క‌షాయం తాగుతూ ఉండాలి.