ఆదివారం 24 జనవరి 2021
Food - Jul 22, 2020 , 21:40:31

ఈ రెసిపీతో మ‌ధుమేహగ్ర‌స్తుల‌కు గుడ్‌న్యూస్‌

ఈ రెసిపీతో మ‌ధుమేహగ్ర‌స్తుల‌కు గుడ్‌న్యూస్‌

ప్రపంచంలో చాలామంది ఎదుర్కొంటున్న వ్యాధి డ‌యాబెటిస్‌. ఇదివ‌ర‌కు వ‌య‌సు మీద ప‌డిన వారిలో మాత్ర‌మే వ‌చ్చే ఈ జ‌బ్బు, ఇప్పుడు వ‌య‌సుతో ప‌నిలేదంటున్న‌ది. ప్ర‌తిఒక్క‌రికీ వ‌చ్చి ఇబ్బంది పెట్టేస్తున్న‌ది. దీనికార‌ణంగా కంటికి క‌నిపించే ఏ ఆహారం తినాల‌న్నా భ‌య‌ప‌డుతుంటారు. క‌ళ్లు ఏమో కావాలంటాయి, క‌డుపు ఏమో వ‌ద్దంటుంది అన్న‌ట్టు ఉంటుంది ప‌రిస్థితి. ఆ రెసిపీలో తిన‌కూడ‌ద‌ని ఇంగ్రీడియంట్స్ ఎన్ని క‌లిపి ఉంటారో అని నాలుక‌ని అనిచిపెట్టుకుంటున్నారు. అందుకే షుగ‌ర్‌తో బాధ ప‌డేవారు కూడా మంచి మంచి రెసిపీలు తినొచ్చు. దీనివ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ ఏ మాత్రం పెర‌గ‌వు. మ‌రి ఆ రెసిపీ గురించి తెలుసుకుందాం. 

మిక్స్-వెజ్ మఖన్వాలా 

కావాల్సిన పదార్ధాలు : 

ఉడికించిన ట‌మాటాలు : 8

ఉడికించిన క్యారెట్స్‌, ఆలూ, బ‌ఠాణి, కాలీ ఫ్ల‌వ‌ర్‌, బీన్స్ : ఒక‌టిన్న‌ర క‌ప్పు

 ప‌చ్చిమిర్చి : ఒక‌టి

జీల‌క‌ర్ర : అర టీస్పూన్‌

జీడిప‌ప్పు పేస్ట్ : అర‌క‌ప్పు

క‌స్తూమేథీ పౌడ‌ర్ : ఒక టీస్పూన్‌

కొత్తిమీర : 3 టేబుల్ స్పూన్లు

త‌యారీ : 

ముందుగా జీల‌క‌ర్ర‌ను వేయించి పెట్టుకోవాలి. త‌ర్వాత ప‌చ్చిమిర్చి, ఉడికించిన ట‌మాట వేసి కాసేపు ఉడికించాలి. తీసిపెట్టుకున్న జీడిప‌ప్పు పేస్ట్‌లో ఒక టీస్పూన్ ప‌క్క‌న పెట్టి మిగిలిన‌దంతా ఈ మిశ్రమంలో వేసి కాసేపు ఉడికించాలి. ఆ త‌ర్వాత ఉడికించిన మిక్స్డ్ వెజిట‌బుల్స్ వేసి దీంతో పాటు క‌స్తూరి మేథీ కూడా వేయాలి. అలాగే రెండు టేబుట్‌స్పూన్ల కొత్తిమీర వేసి ఒక‌సారి బాగా క‌లుపాలి. చివ‌రిగా ప‌క్క‌న పెట్టుకున్న జీడిప‌ప్పు పేస్ట్, కొత్తిమీర‌తో గార్నిష్ చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. logo