గురువారం 02 జూలై 2020
Food - Apr 21, 2020 , 13:20:05

అల్జీమర్స్‌కి పసుపు, కరివేపాకు!

అల్జీమర్స్‌కి పసుపు, కరివేపాకు!

వృద్ధుల్లో వచ్చే మతతిమరుపు (అల్జీమర్స్‌) సమస్యకు ఇప్పటివరకు సరైన మందులే లేవు. కాని ఇటీవలి పరిశోధనలు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. కరివేపాకు, పసుపు వంటి మన వంటింటి పదార్థాలు ఈ సమస్యకు మంచి ఔషధాలుగా పనిచేస్తాయంటున్నారు పరిశోధకులు. అమిలాయిడ్‌ బీటా అనే ప్రొటీన్‌ మెదడులో అడ్డుపడడం వల్ల అల్జీమర్స్‌ సమస్య ఏర్పడుతుంది. ఈ ప్రొటీన్‌ అడ్డును తొలగించే శక్తి కరివేపాకు, పసుపులో ఉన్నట్టు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధనల్లో వెల్లడైంది. వ్యాధినిరోధక కణాలైన మాక్రోఫేజ్‌లను శక్తిమంతం చేసే అంశాలు కరివేపాకులో ఉన్నాయి. ఇవి మతిమరుపును కలిగించే అమిలాయిడ్‌ బీటా ప్రొటీన్లను తొలగించగలుగుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. అల్జీమర్‌స రోగుల నుంచి రక్తాన్ని తీసుకుని, కరివేపాకుతో చేసిన ప్రయోగంలో అమిలాయిడ్‌ బీటా ప్రొటీన్‌ తగ్గిపోవడం గమనించామన్నారు పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్‌ మిలన్‌ ఫియాలా. పసుపు, కరివేపాకుల వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకపోవడం అల్జీమర్స్‌ సమస్య ఉన్నవాళ్లకు వరమే అయింది. 


logo