బుధవారం 03 జూన్ 2020
Food - Apr 10, 2020 , 16:13:59

కీరదోస నీళ్లు.. దాని ఉపయోగాలు

కీరదోస నీళ్లు.. దాని ఉపయోగాలు

కీర తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిస్తుంది. వాటిముక్క‌లు ఒత్తిడిని దూరం చేస్తాయి, ఇక‌పోతే కీర‌ముక్క‌ల‌ను నాన‌బెట్టిన నీరు కూడా ఆరోగ్యానిక మేలు చేస్తాయి. విన‌డానికి కొత్త‌గా ఉన్నా ఇది ప‌చ్చి నిజం. అదెలాగో.. దాని విశేషాలేంటో తెలుసుకోవాలంటే.. ఇది చ‌ద‌వాల్సిందే!

- కీర‌దోస‌ను శుభ్రం చేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. దీన్ని లీట‌ర్ నీటిలో వేసి ఆ మిశ్ర‌మాన్ని ఫ్రిజ్‌లో ఉంచి రెండు గ్లాస‌లు చొప్పున తాగాలి. 

- ఈ నీరు తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు క‌రిగిపోతుంది. 

- గుండె జ‌బ్బుల‌ను నియంత్రిస్తుంది.

- ర‌క్త‌పోటు ఉన్న‌వారికి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. అంతేకాదు డ‌యాబెటిస్ నుంచి కూడా  కాపాడుతుంది.

- కీర‌దోస నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి అల్జీమ‌ర్స్ రాకుండా నియంత్రిస్తుంది.

- ఇందులో విట‌మిన్ కె ఉంటుంది. దీంతో ఎముక‌లు పెలుసుబార‌డం త‌గ్గుతుంది. శ‌రీరంలోని విష‌ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంతోపాటు చ‌ర్మం కాంతివంగా మెరుగుప‌డ‌డానికి తోడ్ప‌డుతుంది. 

- కీర‌దోస నీటిని తాగ‌డం వ‌ల్ల కండ‌రాల‌కు కావాల్సిన పోష‌కాలు కూడా అందుతాయి.

- బరువు తగ్గించడంలో ఈ నీళ్లు ఎంతో బాగా పని చేస్తాయి. అంతే కాదు ఆకలిగా అనిపించినప్పుడు కీరదోస నీళ్లు తాగితే పొట్టనిండినట్టు అనిపిస్తుంది. 

- ఈ కీర నీళ్లలో విటమిన్‌-కె, మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి.


logo