బుధవారం 28 అక్టోబర్ 2020
Food - Sep 27, 2020 , 19:58:35

స్ప్రౌట్స్‌ను దీంతోపాటు క‌లిపి తీసుకుంటున్నారా?

స్ప్రౌట్స్‌ను దీంతోపాటు క‌లిపి తీసుకుంటున్నారా?

మొల‌కెత్తించిన ధాన్యాల‌లో ఉన్న పోష‌కాలు మ‌రే వాటిలో ఉండ‌వు. పోష‌కాల కోసం పెద్ద మొత్తంలో ఖ‌ర్చు పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఇంట్లో వంట‌‌కు వాడే ధాన్యాల‌తోనే శ‌రీరానికి కావాల్సిన అన్ని విట‌మిన్లు, పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌రి మొల‌కెత్తించిన గింజ‌ల‌ను విడిగా తినే వాళ్ల‌కి ఇదొక అడ్వైజ్‌. ఈ మొల‌క‌ల‌ను ఆహారంతో క‌లిపి తీసుకుంటే ఆరోగ్యానికి మ‌రింత మేలు జ‌రుగుతుంది. ఈ మాట వెల్ల‌డించింది మ‌రెవ‌రో కాదు న్యూట్రిష‌నిస్టులు.

ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసేకునే స‌మ‌యం లేక‌పోయినా లేదంటే తిన‌డం ఇష్టం లేక‌పోయినా అలాంటివాళ్లు స్ప్రౌట్స్ తిన‌డం అల‌వాటు చేసుకుంటే మంచిది. వీటిని మొల‌కెత్తించ‌డం వ‌ల్ల ధాన్యాల‌లోని పోష‌కాలు శ‌రీరానికి అందుతాయి. పెస‌లు, ఉల‌వ‌లు, కందులు, ప‌చ్చెన‌గ‌లు వంటి ధాన్యాలు వేటినైనా మొల‌కెత్తించ‌వ‌చ్చు. 


logo