అమ్మాయిలు జట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చే షాంపూ, హెయిర్ ఆయిల్, కండిషనర్ దేన్నీ వదలకుండా వాడేస్తుంటారు. అయినా చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తూంటాయి. అలాంటి కేశ సమస్యలను అనుభవించాకే కోల్‌కతాకు చెందిన స్తుతి కొఠారి ప్రత్యేకంగా ఒక హెయిర్ ఆయిల్‌ను తయారుచేసింది. మంచి ఫలితాలు రావడంతో ఇప్పుడు ఎంట్రప్రెన్యూర్‌గా మారి ‘విష్‌కేర్’ పేరుతో బ్యూటీ బ్రాండ్‌ని మార్కెట్లోకి తెచ్చింది. స్తుతి భర్త అంకిత్ సాఫ్ట్ట్వేర్ డెవలపర్. ఆయన వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేశారు. అలా స్తుతికూడా వివిధరకాల నీళ్లు వాడటంతో జుట్టు రాలడం మొదలైంది. ఎన్ని రకాల నూనెలు, షాంపూలు వాడినా ఫలితం లేకపోయింది. అన్నీ రసాయనాల మయమే. అప్పుడే, తాను వంటింట్లో బియ్యం కడిగిన నీళ్లతో రకరకాల ప్రయోగాలు చేసి ఓ కొత్త పరిష్కారాన్ని కనుగొన్నది. భర్తతో కలిసి ‘విష్‌కేర్’ పేరుతో ఓ కొత్త బ్యూటీ బ్రాండ్‌కు నాంది పలికింది. విష్‌కేర్ ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ (అన్నం గంజి) హెయిర్ కేర్‌లో సల్ఫేట్స్, పారాబెన్స్, సిలికాన్స్ వంటి రసాయనాలు ఉండవని చెబుతున్నది స్తుతి. అలాగే, ఇందులో బాదం, కొబ్బరి, సోయా మొదలైన సహజమైన పదార్థాలనే ఉపయోగిస్తుందట. ‘యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే బియ్యం నీళ్లు జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. ఈ టెక్నిక్‌ను మన అమ్మమ్మల కాలంలో బాగా ఉపయోగించే వాళ్లు’ అంటున్నది స్తుతి కొఠారి.