శనివారం 27 ఫిబ్రవరి 2021
Food - Feb 10, 2021 , 03:00:13

బేబీ కార్న్‌ 65

బేబీ కార్న్‌ 65

కావలసిన పదార్థాలు: బేబీకార్న్‌: పది, శనగపిండి: అరకప్పు, బియ్యప్పిండి: రెండు టీ స్పూన్లు, వంటసోడా: చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌: ఒక టీ స్పూన్‌, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తరుగు: ఒక టీస్పూన్‌, పసుపు: చిటికెడు, ఉప్పు, నూనె: తగినంత

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, వంటసోడా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద, కొత్తిమీర తరుగు వేసి, తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బేబీకార్న్‌ని ఈ పిండిలో ముంచి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే సరి. బేబీకార్న్‌ 65 రెడీ. కావాలనుకుంటే బేబీకార్న్‌ని ముక్కలుగా చేసికూడా చేసుకోవచ్చు. వీటిని టమాటా సాస్‌తో తింటే బాగుంటాయి.

VIDEOS

logo