ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Food - Jan 19, 2021 , 00:12:17

ఖర్జూర బిస్కెట్లు

ఖర్జూర బిస్కెట్లు

కావలసిన పదార్థాలు:

ఖర్జూరం: 50 గ్రాములు, మైదా: 100 గ్రాములు, కోడిగుడ్డు: ఒకటి, పంచదార పొడి: 75 గ్రాములు, బేకింగ్‌ పౌడర్‌: అర చెంచా, వెన్న: 50 గ్రాములు, ఉప్పు: చిటికెడు

తయారీ విధానం

ఎండు ఖర్జూరాలను గింజలు తీసి మెత్తగా దంచాలి. పంచదారను పొడి చేసుకుని వెన్న, కోడి గుడ్డు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా నురుగు వచ్చేంత వరకూ చిలికి ఖర్జూరపు పొడి, ఉప్పు, బేకింగ్‌ పౌడర్‌ వేసి, మైదా జోడించి చపాతీ పిండిలా కలుపుకోవాలి. బాగా కలిపిన మిశ్రమాన్ని ఆరు గంటలపాటు పక్కన పెట్టి, ఆ తర్వాత చపాతీలా ఒత్తుకుని బిస్కెట్లుగా కోసుకుని బేక్‌ చేసుకుంటే సరి. ఆరోగ్యకరమైన ఖర్జూర బిస్కెట్లు సిద్ధం.

VIDEOS

logo