గురువారం 29 అక్టోబర్ 2020
Food - Sep 21, 2020 , 19:53:47

పంటి నొప్పి ఉన్న‌వాళ్ల‌కి 'ఉల్లిర‌సం' భేష్‌గా ప‌నిచేస్తుంది!

పంటి నొప్పి ఉన్న‌వాళ్ల‌కి 'ఉల్లిర‌సం' భేష్‌గా ప‌నిచేస్తుంది!

ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దంటారు. ఇది పాత సామెతే అయినా ఎప్ప‌టికీ వ‌ర్తిస్తుంది. ఉల్లిపాయ లేనిదే కూర రుచి రాదు. అలాగే ఉల్లిర‌సం కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిని జుట్టుకు ప‌ట్టిస్తే కురులు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. అలాగే మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌న్న సంగ‌తి తెలుసా? ఇవి తెలుసుకుంటే చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కు కూడా డాక్ట‌ర్‌ని సంప్ర‌దించాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి ఉల్లిర‌సం ఆరోగ్యానికి ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

* పిల్ల‌లు ఆట‌లాడుకునేట‌ప్పుడు, లేదంటే ఏదైనా ప్ర‌మాదాల‌కు గురైన‌ప్పుడు ముక్కుకు దెబ్బ త‌గిలి ర‌క్తం కార‌డం ఎక్కువ‌గా ఉంటుంది. అలాంట‌ప్పుడు ఉల్లిపాయ‌ను క‌ట్ చేసి ముక్కు ద‌గ్గ‌ర పెట్టి వాస‌న చూస్తే చాలు. వెంట‌నే ర‌క్తం రావ‌డాన్ని ఆపుతుంది.

* శ‌రీరంలో అజీర్ణ స‌మ‌స్య‌లు ఉంటే ఏమి తిన్నా అర‌గ‌దు. ఎంత మంచి ఆహారం తీసుకున్నా స‌హించ‌దు. దీని కార‌ణంగా వాంతులు, విరేచ‌నాలకు గుర‌వుతుంటారు. అలాంట‌ప్పుడు అర‌క‌ప్పు ఉల్లిర‌సంలో కొంచెం గోరువెచ్చ‌ని నీటిని క‌లిపి అప్పుడ‌ప్పుడు తాగితే స‌మ‌స్య త‌గ్గుతుంది.

* నోరు శుభ్రంగా ఉంచుకోక‌పోవ‌డం వ‌ల్ల ప‌ళ్లు పుచ్చిపోతుంటాయి. ఇది భ‌యంక‌ర‌మైన నొప్పిని క‌లుగ‌జేస్తుంది. దీని నొప్పికి త‌ట్టుకోలేక డాక్ట‌ర్‌ని సంప్ర‌దించి దంతాన్నే పీకేపిస్తుంటారు. అంత ప‌ని చేయాల్సిన ప‌నిలేదు. ఉల్లిర‌సం, ఏదైనా ఒక ఆయిల్ తీసుకొని రెండింటినీ స‌మానంగా క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని 5 చుక్క‌లు తీసుకొని పుచ్చ‌ప‌ళ్లు ఉన్న ద‌గ్గ‌ర ప‌ట్టిస్తే అందులోని పురుగు చ‌చ్చిపోతుంది. దీంతో వెంట‌నే నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నాన్నిస్తుంది.

* చిన్న‌పిల్ల‌లు టాన్సిల్ వ్యాధికి గుర‌వుతుంటారు. ఆ స‌మ‌యంలో ఉల్లిగ‌డ్డ తీసుకొని పేస్ట్ చేయాలి. అందులో కొంచెం ఉప్పు వేసి క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని పిల్ల‌ల‌కు తినిపించాలి. త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటిని తాపాలి. ఇలా చేస్తే వ్యాధి త‌గ్గిపోతుంది. 

* చిన్నిపిల్ల‌లు చెవినొప్పి బారిన ప‌డిన‌ట్ల‌యితే వారికి ప్ర‌థ‌మ‌చికిత్స‌గా ముందు ఉల్లిర‌సంతో చేయాలి. మొద‌ట ఉల్లిర‌సాన్ని వేడి చేసి చ‌ల్లార్చాలి. త‌ర్వాత చెవిలో వేస్తే నొప్పి త‌గ్గిపోతుంది. 

* ఇంకా పిల్ల‌ల‌కు రాత్రులు స‌రిగా నిద్ర‌ప‌ట్ట‌క‌పోతే ఇలా చేస్తే స‌రి. ఒక ఉల్లిగ‌డ్డ‌ను నీటిలో వేసి వేడి చేయాలి. త‌ర్వాత ఉల్లిగ‌డ్డ‌ను తీసేసి ఆ నీటిలో కొంచెం చ‌క్కెర వేసి పిల్ల‌ల‌కు ఇచ్చి తాపించాలి. ఇలా చేస్తే వారికి నిద్ర మంచిగా ప‌డుతుంది. 


logo