బుధవారం 05 ఆగస్టు 2020
Food - Jul 04, 2020 , 19:26:48

బీట్‌రూట్.. ఆరోగ్యానికి బెస్ట్ రూట్‌!

బీట్‌రూట్.. ఆరోగ్యానికి బెస్ట్ రూట్‌!

బీట్‌రూట్ తిన‌డం వ‌ల్ల అందం రెట్టింపు అవుతుంద‌ని అంద‌రికీ తెలుసు. దీనివ‌ల్ల బ్ల‌డ్ రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప్ర‌తిరోజూ బీట్ తిన‌డం వ‌ల్ల గాని జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

* ప్ర‌తిరోజూ ఉద‌యాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల రోజంతా చురుగ్గా ఉంటారు.

* జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఎంత నీర‌సంగా ఉన్న‌ప్ప‌టికీ త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది.

* బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి బీట్‌రూట్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనివ‌ల్ల కొవ్వు కూడా క‌రుగుతుంది.

* చ‌దువులో వెనుక‌బ‌డే వారికి బీట్‌రూట్ జ్యూస్ తాగించ‌డం మంచిది. దీనివ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది.

* ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌వారికి బీట్‌రూట్ జ్యూస్ ఉప‌శ‌మ‌నాన్నిస్తుంది.

* అంతేకాదు అన్నిటిక‌న్నా ముఖ్య‌మైన‌ది ఇది కాలేయాన్ని శుభ్రం చేస్తుంది.

* ఎముక‌ల‌ను దృఢంగా ఉంచి మ‌నిషిని స్ట్రాంగ్‌గా చేస్తుంది.

* ఇక‌పోతే చ‌ర్మాన్ని కాంతివంతం చేయ‌డానికి బీట్‌రూట్ స‌హాయ‌ప‌డుతుంది. 


logo