జొన్నపిండితో ఇలా చేస్తే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని తెలుసా?

మన పూర్వీకులకు అప్పుడు వడ్లు లేక జొన్నలతో చేసిన అన్నమే తినేవాళ్లు. అందుకు వాళ్లు బతికినంత కాలం ఎలాంటి ఆనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా బతికారు. ఇప్పుడు అలా కాదు స్టైల్‌కి పోయి ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం తిని రోగాల బారిన పడుతున్నారు. కరోనా మహమ్మారి ఉన్నప్పుడు కూడా ఇలానే చేస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన పద్దవాళ్లు ఫాలో అయ్యే జొన్నలను అన్నంగా చేసుకొని తినకపోయినా వాటితో ఉప్మా, దోశ వంటి రకరకాల వంటలు చేసుకొని తింటే రుచితోపాటు ఆరోగ్యంగా ఉంటారు. మరి జొన్నపిండితో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
జొన్నపిండి దోశకు కావాల్సిన పదార్థాలు :
మినపపప్పు : పావు కప్పు
మెంతులు : చిటికెడు
జొన్నపిండి : ఒక కప్పు
తయారీ :
ముందుగా మినపప్పును ఒక బౌల్లోకి తీసుకోని అందులో మెంతులు కూడా జోడించి నీరు పోసి నాలుగు, ఐదు గంటలపాటు నానబెట్టాలి. తర్వాత వీటిని బాగా కడిగి మెత్తగా మిక్సీ పట్టించాలి. పట్టించేటప్పుడు కొంచెం అన్నం లేదా అటుకులు వేసుకుంటే దోశలు మృదువుగా వస్తాయి. పిండి మిక్సీ పట్టించిన తర్వాత ఇందులో జొన్నపిండి వేసి బాగా కలుపాలి. తర్వాత దీనిని 8 నుంచి 12 గంటలపాటు పులియబెట్టాలి. తర్వాత తీసి అందులో సాల్ట్ కలుపుకొని దోశలుగా పోసుకుంటే సరిపోతుంది. అంతే ఎంతో టేస్టీగా ఉంటే జొన్న దోశలు రెడీ! బియ్యం పిండి, మినపపప్పుతో ఎలా అయితే దోశలు చేసుకుంటారో ఇది కూడా అంతే.
* జొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ మలబద్దకాన్ని దూరం చేస్తుంది. అంతేకాదు గ్యాస్, కడుపుబ్బరం, జీర్ణ సమస్యలు ఇలా ఏవి ఉన్నా అన్నీ పోతాయి.
* వీటిలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇవి ప్రీమెచ్యూర్ ఏజింగ్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
* అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సమయంలో కావాల్సింది ఇమ్యునిటీ పవర్. జొన్నలో ఇది టన్నుల కొద్ది ఉంటుంది. మెగ్నీషియం, క్యాల్షియం, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఎముకలను దృఢంగా చేయడానికి జొన్నలు ఉపయోగపడుతాయి. ఇందులో ఉండే ఐరన్ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్‌ను పెంచి ఇమ్యునిటీని పెంచుతాయి.