సోమవారం 18 జనవరి 2021
Food - Sep 16, 2020 , 15:48:23

సీజ‌న్‌లో దొరికే పుట్ట‌గొడుగులు తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు!

సీజ‌న్‌లో దొరికే పుట్ట‌గొడుగులు తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు!

సీజ‌న్‌లో వ‌చ్చే పండ్లు, కూర‌గాయ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఇటు ఆరోగ్యంతో పాటు య‌వ్వ‌నంగా ఉంచేందుకు ఎంతో తోడ్ప‌డుతాయి. మ‌రి పుట్ట‌గొడుగులు తిన‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలేంటో తెలిస్తే తిన‌డానికి ఆస‌క్తి చూపుతారు.

ప్ర‌యోజ‌నాలు :

కొలెస్ట్రాల్ బ‌ర్న్ :

పుట్ట‌గొడుగుల్లో ప్రోటీన్లు, ఫైబ‌ర్‌, ఎంజైములు, తక్కువ కార్బోహైడ్రేట్లతో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇవి జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. 

రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది :

ఇందులో బీటా-గ్లూకాన్స్‌, యాంటీ కార్సినోజెన్‌లతో కలిపిన లినోలెయిక్ ఆమ్లం ఉన్నాయి. పుట్ట‌గొడుగులు రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు ఇవి సహాయపడతాయి. మహిళల్లో ఈస్ట్రోజెన్‌ను అణచివేయడానికి లినోలెయిక్ ఆమ్లం సహాయపడుతుంది. దీంతో రొమ్ము క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకుంటుంది. బీటా-గ్లూకాన్స్ ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ కణాలను అణిచివేసేందుకు సెలీనియం చాలా సహాయపడుతుంది. 

మధుమేహ వ్యాధిగ్రస్తులకు పర్ఫెక్ట్ డైట్ :

పుట్టగొడుగులలో ఫ్యాట్‌, తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రోటీన్లు, ఎంజైములు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటివి ఉండవు. అందువ‌ల్ల‌ ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం. ఇందులోని సహజ ఎంజైములు చక్కెరలు, పిండి పదార్ధాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి. ఇవి ఎండోక్రినల్ గ్రంథుల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాదు పుట్టగొడుగులలోని సహజ యాంటీబయాటిక్స్ డయాబెటిస్ ప్రజలను అంటువ్యాధుల నుంచి కాపాడుతాయి.

రోగనిరోధక శక్తి :

పుట్టగొడుగులలో విటమిన్‌ ఎ, బి, సి లు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. వాటిలో ఉండే యాంటీబయాటిక్స్ అంటువ్యాధులపై పోరాడటానికి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్, ఎర్గోథియోనిన్ ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది.

వెయిట్ లాస్ :

పుట్ట‌గొడుగులు అధిక బ‌రువును త‌గ్గించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. 

విటమిన్ డి :

విటమిన్ డి కలిగి ఉన్న ఏకైక ఆహారం పుట్టగొడుగు. ఇందులో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, రాగి,సెలీనియం ఉంటాయి.

విటమిన్ బి1 :

పుట్టగొడుగులు విటమిన్ బి1 పుష్క‌లంగా ఉంటుంది. దీనిని థియామిన్ అని కూడా పిలుస్తారు. కార్బోహైడ్రేట్ల నుంచి శక్తిని విడుదల చేయడాన్ని నియంత్రించడానికి థయామిన్ బాధ్యత వహిస్తుంది. నాడీవ్యవస్థ, మెదడు పనితీరుకు ఇది అవసరం.

విటమిన్ బి2 :

ఈ విటమిన్ కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలను కూడా నిర్వహిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పుట్టగొడుగులో ఉండే విటమిన్ బి2 చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

విటమిన్ బి3 :

నియాసిన్, విటమిన్ బి3 పుట్టగొడుగులలో కనిపించే మరొక ముఖ్యమైన బి-విటమిన్. ఇది కార్బోహైడ్రేట్, కొవ్వు, ప్రోటీన్ నుంచి శక్తిని విడుదల చేయడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది శరీర నాడీ వ్యవస్థ, జీర్ణవ్యవస్థను మెరుగుప‌ర‌చ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

విటమిన్ బి5 :

పాంటోథెనిక్ యాసిడ్ అని పిలువబడే విటమిన్ బి5 సహజంగా పుట్టగొడుగులలో కనిపిస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియ రేటును మెరుగుప‌రుస్తుంది. పాంతోతేనిక్ ఆమ్లం శరీరంలోని హార్మోన్ల ఉత్పత్తికి సహాయం చేస్తుంది.

విటమిన్ బి6 :

విటమిన్ బి6 పుట్టగొడుగులలో కూడా ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయపడుతుంది. ఇది మెదడు పనితీరును అభివృద్ధి చేస్తుంది. ఈ విటమిన్ డిప్రెషన్ నుంచి ఉపశమనాన్నిస్తుంది.

విటమిన్ బి9 :

పుట్టగొడుగులలో విటమిన్ బి9 అధికంగా ఉంటుంది. దీనిని ఫోలేట్ అని కూడా పిలుస్తారు. ఎముక మజ్జలో తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి విటమిన్ బి9 సహాయపడుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఫోలేట్ చాలా అవసరం. గర్భిణీ స్త్రీల‌కు కూడా ఫోలేట్ తినమని సలహా ఇస్తారు. ఇది పిండం పెరుగుదలకు సహాయపడుతుంది.

విటమిన్ హెచ్ :

విటమిన్ హెచ్ లేదా బయోటిన్ కూడా బి-విటమిన్ రకం. ఇది పుట్టగొడుగులలో కనిపిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో ఆరోగ్యాన్ని బలపరుస్తుంది.