శుక్రవారం 22 జనవరి 2021
Food - Sep 08, 2020 , 19:03:59

సోంపుతో ఇలా చేస్తే.. ప‌డుకోగానే నిద్ర‌ప‌డుతుంది!

సోంపుతో ఇలా చేస్తే.. ప‌డుకోగానే నిద్ర‌ప‌డుతుంది!

ప‌గ‌లంతా క‌ష్ట‌ప‌డేవారికి రాత్రులు ప‌డుకోగానే నిద్ర‌ప‌డుతుంది. కానీ జీవ‌న‌శైలి, తినే ఆహారం వ‌ల్ల వీరు నిద్ర‌లేమికి గుర‌వుతున్నారు. రాత్రులు స‌రిగా నిద్ర‌ప‌ట్ట‌క చాలామంది అనారోగ్యాల‌కు గుర‌వుతున్నారు. దీనికి విరుగుడుగా రాత్రులు పాలు తాగితే బాగా నిద్ర‌ప‌డుతుంది అంటారు. అయినా కొంత‌మందికి ప్ర‌యోజం ఉండ‌డం లేదు. అందుకు మ‌రో ప‌ద్ద‌తిని ట్రై చేసి చూడ‌మంటున్నారు ఆరోగ్య నిపుణులు. మ‌రి దానికి కావాల్సిన ప్ర‌దాన‌మైన‌ ఇంగ్రీడియంట్ సోంపు.

భోజ‌నం త‌ర్వాత ఆహారం అర‌గ‌డానికి వేసుకునే సోంపు నిద్ర‌ప‌ట్టేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. ముందుగా 250 మి.లీ. నీటిని తీసుకోవాలి. అందులో 10 గ్రా. సోంపు వేసి బాగా మ‌రిగించాలి. నీరు స‌గానికి వ‌చ్చేంత వ‌ర‌కు వేడి చేయాలి. త‌ర్వాత ఆ నీటిని వ‌డ‌బోయాలి. ఇందులో కాచిన 100 మి.లీ. పాల‌ను జోడించాలి. అలానే కొంచెం నెయ్యి, టీస్పూన్ క‌టిక బెల్లం పొడి వేసి బాగా క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని రాత్రి ప‌డుకునే ముందు తాగితే వెంట‌నే నిద్ర‌ప‌డుతుంది. ఈ రెసిపీ ద‌గ్గు, అస్త‌మా, జ‌లుబు వంటి రోగాల‌కు కూడా బాగా ప‌నిచేస్తుంది.  logo