శుక్రవారం 22 జనవరి 2021
Food - Jan 11, 2021 , 00:06:18

ఖర్జూర కొబ్బరి లడ్డు

ఖర్జూర కొబ్బరి లడ్డు

కావలసిన పదార్థాలు

కొబ్బరి పొడి: 2 కప్పులు, పచ్చి ఖర్జూరాలు : ఒకటిన్నర కప్పులు, జీడిపప్పు: 10, బాదం పప్పు: 10, కిస్మిస్‌: 10, ఇలాచీ పొడి: అర టీస్పూన్‌

తయారుచేసే విధానం

ముందుగా ఖర్జూరాలని గింజలు తీసేసి మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొబ్బరి పొడి వేసి మరోసారి తిప్పాలి. మొత్తం కలిశాక ఒక గిన్నెలోకి తీసుకుని  చిన్న ముక్కలుగా కట్‌ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్‌, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని లడ్డూల్లా చుట్టుకుంటే సరి. ఎంతో ఆరోగ్యకరమైన ఖర్జూర కొబ్బరి లడ్డూలు రెడీ. ఇష్టమైన వాళ్లు లడ్డూలపై కొబ్బరిపొడి చల్లుకోవచ్చు.


logo