ఆదివారం 07 మార్చి 2021
Food - Feb 24, 2021 , 00:05:52

ఓట్స్‌ పాలక్‌ పకోడి

ఓట్స్‌ పాలక్‌ పకోడి

కావలసిన పదార్థాలు:  ఓట్స్‌: ఒక కప్పు, పాలకూర: రెండు కప్పులు, పచ్చిమిర్చి: రెండు, అల్లం తురుము: ఒక టీస్పూను, కారం: ఒక టీస్పూన్‌, పసుపు: చిటికెడు, కరివేపాకు: ఒక రెబ్బ, నూనె: వేయించడానికి సరిపడా, వేడినీళ్లు: సరిపడినన్ని, ఉప్పు: తగినంత

తయారీ విధానం: ముందుగా ఓట్స్‌ను వేడి నీళ్లలో వేసి పకోడి పిండిలా కలపాలి. అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తటి ముద్దలా చేసి ఓట్స్‌ పిండిలో కలపాలి. ఇప్పుడు పాలకూరను సన్నగా తరిగి పిండిలో వేసి కారం, కరివేపాకు కలపాలి. కడాయిలో నూనె వేడిచేసి పకోడీల్లా వేసుకుంటే సరిపోతుంది. వేడివేడి ఓట్స్‌ పాలక్‌ పకోడి రెడీ!

VIDEOS

logo