బుధవారం 03 మార్చి 2021
Food - Feb 23, 2021 , 02:45:12

పుదీనా పరోట

పుదీనా పరోట

కావలసిన పదార్థాలు

గోధుమపిండి: ఒక కప్పు, మైదా: ఒక కప్పు, టమాటా: ఒకటి, పుదీనా: ఒక కట్ట, కరివేపాకు: నాలుగు రెబ్బలు, తాలింపు దినుసులు: ఒక చెంచా, పచ్చిమిర్చి: రెండు, అల్లం తరుగు: ఒక టీ స్పూను, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, మైదా, ఉప్పు, నూనె వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. పుదీనా, టమాటా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడయ్యాక తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక సన్నగా తరిగిన టమాటా, పుదీనా వేసి వేయించాలి. బాగా మగ్గాక ఉప్పు చల్లి దింపేయాలి. కొద్దికొద్దిగా పిండి తీసుకుని చపాతీలా ఒత్తుకుని మధ్యలో పుదీనా మిశ్రమాన్ని కూరి మళ్లీ ఉండల్లా చుట్టేయాలి. వాటిని పరోటాలా ఒత్తుకుని పెనం మీద రెండువైపులా నూనె వేస్తూ కాల్చుకుంటే పుదీనా పరోటా రెడీ.

VIDEOS

logo