శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Food - Feb 19, 2021 , 00:04:55

పాలకూర ముల్లంగి టిక్కీ

పాలకూర ముల్లంగి టిక్కీ

కావలసిన పదార్థాలు : పాలకూర తురుము: ఒక కప్పు, ముల్లంగి, క్యారెట్‌: ఒక్కొక్కటి, ఉడకబెట్టిన ఆలుగడ్డలు: రెండు, పచ్చిమిర్చి: రెండు, అల్లం పేస్టు: అర టీస్పూను, పచ్చిబఠానీలు: అరకప్పు, మిరియాల పొడి: పావు టీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: సరిపడినంత

తయారీ విధానం: ముందుగా క్యారెట్‌, ముల్లంగి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. పచ్చిబఠానీలను బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఉడకబెట్టిన ఆలుగడ్డలను మెత్తగా మెదిపి అందులో క్యారెట్‌, ముల్లంగి తురుము, పాలకూర తరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో పచ్చిమిర్చి తరుగు, అల్లం పేస్టు వేయాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు చల్లుకుంటూ కలపాలి. ఆ మిశ్రమాన్ని టిక్కీల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద పెనం పెట్టి, ఒక టీస్పూను నూనె వేసి టిక్కీలను రెండు వైపులా ముదురు గోధుమ రంగులోకి వచ్చే వరకు కాల్చు కోవాలి. అంతే, పాలకూర ముల్లంగి టిక్కీలు రెడీ!

VIDEOS

logo