శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Food - Feb 17, 2021 , 00:04:14

కొత్తిమీర పలావ్‌

కొత్తిమీర పలావ్‌

కావలసిన పదార్థాలు

బియ్యం: రెండు కప్పులు (నానబెట్టుకోవాలి), కొత్తిమీర: ఒక కట్ట, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, టమాటాలు: రెండు, ఉప్పు: తగినంత, నెయ్యి: 2 టీ స్పూన్లు, లవంగాలు: ఆరు, యాలకులు: నాలుగు,  దాల్చిన చెక్క: రెండు చెక్కలు

తయారీ విధానం

కడాయిలోని నెయ్యి వేడయ్యాక పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఓ నిమిషంపాటు వేయించి, దించి చల్లార్చుకోవాలి. వేయించిన కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్టులా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఓ కడాయిలో కొంచెం నెయ్యి వేసి, వేడయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి వేయించాలి. వేగిన తర్వాత కొత్తిమీర పేస్టు వేసి.. కలుపుతూ వేయించాలి. టమాటా ముక్కల్ని కలిపి 5 నిమిషాలపాటు వేగాక ఉప్పు వేసుకోవాలి. అందులో మూడున్నర కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు పొర్లుతుండగా నానబెట్టిన బియ్యాన్ని వేసి కలియబెట్టుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత దించేయాలి. అంతే, కొత్తిమీర పలావ్‌ రెడీ!

VIDEOS

logo