మంగళవారం 02 మార్చి 2021
Food - Feb 12, 2021 , 01:43:20

మునగాకు సూప్‌

మునగాకు సూప్‌

కావలసిన పదార్థాలు:

మునగాకు: రెండు కప్పులు, క్యారెట్‌ తురుము: అర కప్పు, కొబ్బరి తురుము: అర కప్పు, ఉల్లి తరుగు: అర కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌: ఒక స్పూన్‌, కొత్తిమీర తరుగు: పావు కప్పు, ఉప్పు: తగినంత, మిరియాల పొడి: ఒక టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర: ఒక టేబుల్‌ స్పూన్‌, నూనె: రెండు టీ స్పూన్లు, ఇంగువ: చిటికెడు, నెయ్యి: ఒక టేబుల్‌ స్పూన్‌

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో ఉల్లి తరుగు, క్యారెట్‌ తురుము, కొబ్బరి తురుము, అల్లం, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్‌ వేసి ఐదు కప్పుల నీళ్ళుపోసి కాసేపు ఉడికించాలి. కడాయిలోని నెయ్యి వేడయ్యాక జీలకర్ర, మునగాకు వేసి దోరగా వేయించి ఉడుకుతున్న క్యారెట్‌, కొబ్బరి తురుము మిశ్రమంలో వెయ్యాలి. మిశ్రమం బాగా ఉడికాక, చల్లార్చుకొని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు సూప్‌ని బౌల్‌లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర, మిరియాల పొడి చల్లి సర్వ్‌ చేసుకుంటే చాలు.


VIDEOS

logo