ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Food - Feb 09, 2021 , 01:34:22

పుదీనా కొర్రల కిచిడి

పుదీనా కొర్రల కిచిడి

కావలసిన పదార్థాలు: కొర్రలు: ఒకటిన్నర కప్పు, పుదీనా తరుగు: పావు కప్పు, ఉప్పు: తగినంత, ఉల్లిపాయలు: రెండు, నూనె: రెండు టేబుల్‌ స్పూన్లు, టమాటా: రెండు, పచ్చిమిర్చి: ఐదు, జీడిపప్పు: పది, జీలకర్ర: పావు టీ స్పూన్‌, పసుపు: చిటికెడు

తయారీ విధానం: ముందుగా కొర్రలను బాగా కడిగి, మూడు కప్పుల నీళ్ళు పోసి ప్రెషర్‌ కుక్కర్‌లో మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటలను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసి పక్కన ఉంచుకోవాలి. పుదీనా అకులను పేస్టు చేసి పెట్టుకోవాలి. కడాయిలోని నూనె వేడయ్యాక జీడిపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగాక ఉప్పు, పసుపు, టమాటా ముక్కలు, పుదీనా మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలపాటు మగ్గించాలి. నీళ్లు వడకటి,్ట ఆరబెట్టిన కొర్రలను వేసి బాగా కలిపి దించుకుంటే సరి. పుదీనా కొర్రల కిచిడి రెడీ.

VIDEOS

logo