శనివారం 27 ఫిబ్రవరి 2021
Food - Feb 07, 2021 , 00:12:06

సజ్జ ఆలూ పరాటా

సజ్జ ఆలూ పరాటా

కావాల్సినవి:

సజ్జ పిండి: రెండు కప్పులు, గోధుమపిండి: అర కప్పు, ఉడికించి చిదిమిన ఆలుగడ్డ: ఒక కప్పు, మెంతికూర లేదా కొత్తిమీర: అర కప్పు, పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్‌, కారం: అర టీ స్పూన్‌, పసుపు: పావు టీ స్పూన్‌, అల్లం తరుగు: ఒక టీ స్పూన్‌, జీలకర్ర: ఒక టీ స్పూన్‌, వాము: పావు టీ స్పూన్‌, చాట్‌ మసాలా: అర టీ స్పూన్‌, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా

తయారీ

ఒక పెద్ద గిన్నెలో సజ్జ పిండి, గోధుమ పిండి, ఆలుగడ్డ ముద్ద, మెంతికూర లేదా కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం తరుగు, జీలకర్ర, వాము, చాట్‌ మసాలా వేసి కలపాలి. గోరువెచ్చని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలిపి పావుగంటసేపు పక్కనపెట్టాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుని కాస్తంత మందంగా వత్తాలి. ఇలా పిండి మొత్తాన్నీ చేసుకున్నాక, ఒక్కో పరాటాను పెనంపై నూనె చల్లుతూ రెండువైపులా కాల్చాలి. ఈ సజ్జ ఆలూ పరాటాలను  చట్నీతో నంజుకుని తింటే టేస్టీగా ఉంటాయి.

VIDEOS

logo