శనివారం 27 ఫిబ్రవరి 2021
Food - Feb 05, 2021 , 01:30:35

బీట్‌రూట్‌ మంచూరియ

బీట్‌రూట్‌ మంచూరియ

కావలసిన పదార్థాలు

బీట్‌రూట్‌ తురుము: ఒక కప్పు, కార్న్‌ ఫ్లోర్‌: ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, గరం మసాలా: ఒక టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక టీస్పూన్‌, కొత్తిమీర: పావు కప్పు, సోయా సాస్‌, టమాటా సాస్‌, చిల్లీ సాస్‌: అర టీస్పూను చొప్పున, షాజీరా: అర టీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా

తయారీ విధానం : 

ఒక గిన్నెలో బీట్‌రూట్‌ తురుము, కార్న్‌ ఫ్లోర్‌, ఉప్పు, గరం మసాలా, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి నూనె వేసి బీట్‌రూట్‌ ఉండల్ని డీప్‌ ఫ్రై చేయాలి. మరొక కడాయిలో కాస్త నూనె వేసి, వేడయ్యాక షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. వేగిన తర్వాత సోయాసాస్‌, చిల్లీ సాస్‌, టమాటా సాస్‌ వేసి బాగా కలపాలి. బీట్‌రూట్‌ ఉండల్ని వేయాలి. గరం మసాలా చల్లి కొత్తిమీరతో అలంకరించాలి.


VIDEOS

logo